Moviesస్టార్ హీరో కోసం అలాంటి పని చేయబోతున్న రామ్ చరణ్ ..మండిపడుతున్న...

స్టార్ హీరో కోసం అలాంటి పని చేయబోతున్న రామ్ చరణ్ ..మండిపడుతున్న మెగా ఫ్యాన్స్.. ఎందుకంటే..?

రామ్ చరణ్… మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు . రామ్ చరణ్ నటించిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ఫ్లాప్ అయ్యాయి . అయితే ఎక్కువ శాతం హిట్లే అయ్యాయి . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలు రాంచరణ్ కెరియర్ ని మలుపు తిప్పాయి . మగధీర – రంగస్థలం -ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఆయన కెరియర్లో స్పెషల్ మైలురాయిని క్రియేట్ చేశాయి .

మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు . ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు . పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు . కాగా రీసెంట్గా రాంచరణ్ తీసుకున్న నిర్ణయం మెగా అభిమానులకు మండేలా చేస్తుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ చాలా దయగల మనిషి..

ముఖ్యంగా ఫ్రెండ్షిప్ కి చాలా చాలా వాల్యూ ఇస్తారు. ఎవరైనా సరే తనకు నచ్చితే అది ఎంత పనైనా చేసేస్తాడు. బాలీవుడ్ హీరో కోసం గెస్ట్ రోల్ లో నటించడానికి ఓకే చేశాడు రామ్ చరణ్ అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఆ బాలీవుడ్ హీరో అంటే రామ్ చరణ్ కి చాలా చాలా ఇష్టమట . ఆ కారణంగానే ఆ హీరో నోరు తెరిచి అడగ్గానే గెస్ట్ రోల్ లో నటించడానికి ఓకే చేశారట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అయితే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ఇలా వేరే హీరో సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి ఒప్పుకోవడం మెగా అభిమానులకి నచ్చడం లేదు . అందుకే కోపంగా ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news