Moviesఆ విషయంలో కాజల్ దేవత రా బాబు ..ఏ హీరోయిన్ చేయని...

ఆ విషయంలో కాజల్ దేవత రా బాబు ..ఏ హీరోయిన్ చేయని పెద్ద సాహసమే చేసిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని పొగుడుతూ ఉంటే ..ఏ హీరోయిన్ ఫాన్స్ ఆ హీరోయిన్ కి సంబంధించిన మంచి విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ చందమామ గా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి .

కాజల్ అగర్వాల్ .. పరిచయం అక్కరలేని పేరు . లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మగధీరతో తన స్థాయిని స్టేటస్ ని రెండిటిని మార్చేసుకుంది . కెరియర్ పిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్చులు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అంతేకాదు వెంటనే బాబుకు జన్మనిచ్చేసింది . జనరల్ గా ఏ హీరోయిన్ కూడా ఈ విధంగా చేయదు .

పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనాలి అనే ఆలోచన ఏ హీరోయిన్ కూడా తన మదిలోకి రానివ్వదు . కానీ కాజల్ మాత్రం అలాంటి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంది. హీరోయిన్స్ కి ఫిజిక్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే . ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఫిజిక్ మారిపోతుంది. కాజల్ కి కూడా అలాగే మారింది. అయినా సరే బిడ్డ పుట్టిన ఆరు నెలలకే తన బాడీని చక్కటి షేపు లోకి మార్చుకునేసింది కాజల్. ఆ విషయంలో నిజంగా కాజల్ దేవత అనే చెప్పాలి . ఓ పక్క కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోపక్క సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది కాజల్ అగర్వాల్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news