Moviesసిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ చేయబోయేది ఏ డైరెక్టర్ తోనో తెలుసా...

సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ చేయబోయేది ఏ డైరెక్టర్ తోనో తెలుసా ..? మరో హిట్ పక్కా..!

సిద్దు జొన్నలగడ్డ .. ప్రజెంట్ ఈ పేరు ఓ పాన్ ఇండియా స్టార్ ని మించిన రేంజ్ లో దూసుకుపోతుంది . సిద్దు జొన్నలగడ్డ చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటాయి . కామెడీనే ప్రధాన పీటగా చేసుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటాడు సిద్దు జొన్నలగడ్డ . గతంలో డీజే టిల్లు ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం సిద్దు జొన్నలగడ్డ నటన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమాను ఓకే చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల గురించి జనాలు ఈ విధంగా చర్చించుకుంటారు . అయితే ఇప్పుడు అంతకుమించిన స్టార్ స్టేటస్ సంపాదించేసుకున్నాడు సిద్ధ జోనలగడ్డ . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సిద్దు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమాను మారుతి దర్శకత్వంలో ఓకే చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా కూడా పూర్తిగా కామెడీ జోనర్ ల్లోనే తెరకెక్కబోతుందట. కానీ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోతుందట . మారుతి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? కడుపు చెక్కలయ్యే విధంగా నవ్వాల్సిందే . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సిద్ధూ ఖాతాలో మరో హిట్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..? జనాలు ఏ విధంగా ఈ సినిమాను ఆదరిస్తారో..? తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news