Moviesడిజె టిల్లు సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.....

డిజె టిల్లు సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. మంచి పని చేసావ్ భయ్యా..!

జనరల్ గా ఏదైనా హిట్ సినిమాని వదులుకున్నారు అని తెలిస్తే ఫ్యాన్స్ బాధపడి పోతారు . అయ్యయ్యో మంచి సినిమాని మిస్ చేసుకున్నావే అంటూ కొంతమంది ట్రోల్ చేస్తారు . మరి కొంతమంది బాధపడతారు . అయితే ఇక్కడ మాత్రం ఓ హీరో విషయంలో అంత రివర్స్ గా జరుగుతుంది . డీజే టిల్లు లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు అని తెలిసిన ఓ రేంజ్ లో ఆ హీరోని పొగిడేస్తున్నారు .

మంచి పని చేశావు బ్రదర్ .. నీకు ఇండస్ట్రీలో మంచి రోజులు వస్తాయి అంటూ కాన్ఫిడెన్స్ పెంచేస్తున్నారు . ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పేరు సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి సినిమాతో ఆటిట్యూడ్ హీరో.. రౌడీ హీరో అని ట్యాగ్ చేయించుకున్న విజయ్ దేవరకొండ.. ముందుగా డిజే టిల్లు స్టోరీని వివరించారట. డైరెక్టర్ – ప్రొడ్యూసర్ కూడా ఈ హీరో అయితేనే బాగుంటాడు అంటూ బాగా కమిట్ అయ్యారట .

కానీ పదే పదే అదే బోల్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తే జనాలు పెద్దగా లైక్ చేయరని భావించిన విజయ్ దేవరకొండ .. ఆ సినిమాను సింపుల్గా రిజెక్ట్ చేశాడట . కానీ సినిమా హిట్ అవుతుందని తెలుసు .. అయినా కూడా రిజెక్ట్ చేశాడు అంటే అది విజయ్ దేవరకొండ ఘట్స్ అని చెప్పాలి . డిఫరెంట్ షేడింగ్ పాత్రలో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించే విజయ్ దేవరకొండ మంచి సినిమాని మిస్ చేసుకున్న సరే ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు .

విజయ్ దేవరకొండ ఆలోచన కరెక్టే .. ఎప్పుడు బోల్డ్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తే జనాలు లైక్ చేయరు అంటూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు . ఒకవేళ డీజెటిల్లు సినిమాని ఒప్పుకొని ఉండి ఉంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాని కూడా విజయ్ దేవరకొండ నే చేసి ఉండాల్సి వచ్చేది . బ్యాక్ టు బ్యాక్ ఇలా రెండు సినిమాల్లో బోల్డ్ పర్ఫామెన్స్ అంటే ఆయన పరువును ఇండస్ట్రీలో ఎలా తీసేసేవారో మనం అర్థం చేసుకోవచ్చు .. మొత్తానికి హిట్ సినిమాలు మిస్ చేసుకుని బతికిపోయాడు విజయ్ దేవరకొండ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news