Moviesబాలయ్య కెరీర్ నే మలుపు తిప్పిన హిట్ సినిమా టైటిల్ ను...

బాలయ్య కెరీర్ నే మలుపు తిప్పిన హిట్ సినిమా టైటిల్ ను పెట్టుకున్న శర్వానంద్..నో డౌట్ పక్క బ్లాక్ బస్టర్..!

ఈ మధ్యకాలంలో ఇది కామన్ అయిపోయింది . గతంలో హిట్ అయిన సినిమాలను మళ్లీ సిక్వెల్స్ గా తెరకెక్కించడం.. గతంలో హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండడం మనం కామన్ గా చూస్తున్నాం . అయితే గతంలో సీనియర్ స్టార్ హీరోస్ చేసిన కొత్త స్ట్రాటజీలను మరోసారి తెరపైకి తీసుకొని రావడానికి బాగా ట్రై చేస్తున్నాడు టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శర్వానంద్ .

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండింగ్ మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . రీసెంట్ గానే తండ్రి అయిన ఈ హీరో ఫుల్ జోష్ మీద ఉన్నాడు . ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . రీసెంట్గా శర్వానంద్ – అభిలాష రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు .

ఈ మూవీ చేస్తూనే మరోవైపు అనిల్ సుంకర నిర్మాతగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో ఇంకో సినిమాని సట్స్ పైకి తీసుకొచ్చాడు . అంతేకాదు సుంకర నిర్మాతగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసేసాడు . తన సినిమాల విషయంలో టైటిల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకునే శర్వానంద్ ఈసారి బాలయ్య హిట్ సినిమా టైటిల్ పై కన్నేసాడు .

రామ్ అబ్బరాజు కూడా తన సినిమాలకు డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ పెడతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగుదనం ఉట్టుపడేలా టైటిల్స్ పెట్టడంలో బాగా ధిట్ట. తన గత చిత్రానికి సామజవరగమన అనే టైటిల్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈసారి శర్వానంద్ తో తెరకెక్కించే సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ ని ప్లాన్ చేశాడట .

ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అంతే కాదు శర్వానంద్ బాలయ్య కు బిగ్ ఫ్యాన్ కూడా .. టైటిల్ కు తగ్గట్టు ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ఒకరు సంయుక్తా మీనన్ ఇంకొకరు సాక్షి వైద్యగా ఈ సినిమాలో హీరోయిన్లుగా చూస్ చేసుకున్నారట .

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్స్ సరవేగంగా ముందుకు వెళుతున్నాయి . ఏప్రిల్ 10 వరకు ఇది కొనసాగుతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు శర్వానంద్ అభిమానులు. బాలయ్య సినిమా టైటిల్ పెట్టుకోగానే సినిమాకి మరింత హైప్ వచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news