Moviesరామాయణం కోసం రణ్‌బీర్ కసరత్తులు.. సీత వనవాసం (ఫొటోస్)..!

రామాయణం కోసం రణ్‌బీర్ కసరత్తులు.. సీత వనవాసం (ఫొటోస్)..!

బాలీవుడ్ క్యూట్ అండ్ చాక్లెట్ బాయ్ రణబీర్ మనందరికీ సుపరిచితమే. ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రణబీర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మునిపెన్నడు చూడని విధంగా యానిమల్ మూవీలో రణబీర్ ని చూసాం అని చెప్పుకోవచ్చు. దీన్నంతటికి మెయిన్ రీజన్ సందీప్ వంగ డైరెక్షనే. గతంలో అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలకి డైరెక్షన్ వహించిన సందీప్ వంగా అనిమల్ సినిమాతో మరోసారి తన పేరు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాడు. ఇక సందీప్ వంగ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమాలు చేసేందుకు పలువురు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే రణబీర్ ప్రస్తుతం నటించబోయే మూవీ రామాయణం. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం.

మునిపెన్నడు ఏ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టలేదు బాలీవుడ్లో. అలాంటి బాలీవుడ్ లో ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో రామాయణం తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్ర రణబీర్ పోషిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు అయితే ఎటువంటి సినిమా రాలేదు. దీంతో ఈ సినిమాపై ఎక్కువ క్యూరియాసిటీస్ పెరిగాయి. రాముడిగా రణబీర్ ని సీతగా సాయి పల్లవిని చూసి కన్నులు విందు చేసుకునేందుకు తమ ఫ్యాన్స్ ఎంతో ఆరాటంతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో తమ పేర్లను మరోసారి ట్రెండింగ్ లోకి తేవాలనే గట్టి పట్టు పై ఉన్నారు. హీరో ,హీరోయిన్ కూడా.

ఈ క్రమంలోనే రణబీర్ భారీ కసరత్తులు మొదలుపెట్టాడు. క్లీన్ షేవ్ తో ఫిట్ బాడీ తో తాజాగా దర్శనమిచ్చాడు. ప్రస్తుతం రణబీర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ సినిమాకి కూడా రణబీర్ ఇంత కసరక్తులు చేసి ఉండడు. కానీ రామాయణం అనేసరికి క్లీన్ షేవ్ మరియు కొద్దిగా డీసెంట్ లుక్ లో కనిపించాడు. అసలే మనోడు చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డీసెంట్ బాయ్ గా కూడా పేరు తెచ్చుకుంటాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కోసం రాముడు కసరత్తులు చేస్తుంటే సీత వనవాసం చేస్తుంది. ఇప్పటికే రణబీర్ లుక్ పై అనేక ఫోటోలు బయటికి వచ్చాయి. కానీ సాయి పల్లవి లుక్ మాత్రం ఇప్పటికి కూడా బయటికి రాలేదు. బహుశా సాయి పల్లవి అచ్చం శీతలాగే ఉంటుంది కనుక పెద్దగా ఏమి మార్చుకో అవసరం లేదు. ఇక ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం రణబీర్ లుక్ కి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news