Moviesబిగ్ బ్రేకింగ్: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కన్ను మూసిన ప్రముఖ...

బిగ్ బ్రేకింగ్: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కన్ను మూసిన ప్రముఖ కమెడియన్..!

ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమని ‌ విషాదాలు కన్నీరు మున్నీరు చేస్తున్నాయి. 2023 మొత్తం భారీ విషాదాలతోనే నిండి ఉంది. పోనీలే 2024లో అడుగు పెట్టాము కదా కొద్దిగా ఈ విషాదాల నుంచి కోలుకోవచ్చు అనుకునే లోపే తమ ఫ్యాన్స్ కి కన్నీరే మిగులుతుంది. నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ చనిపోవడం ద్వారా అధికాస్త రచ్చగా మారుతుంది.

ఒక సెలబ్రిటీ మృతిని జీర్ణించుకునే లోపే మరో సెలబ్రిటీ కన్నుమూస్తూ షాక్ ఇస్తున్నారు. తాజాగా బేబీ నిర్మాత అయిన ఎస్ కే ఎన్ తండ్రి మరియు ప్రముఖ సంగీత దర్శకుడు ‌ రషీద్ ఖాన్, సీనియర్ హీరో వేణు తండ్రి ఇలా అనేకమంది 2024లో మృతి చెందారు. ఇక తాజాగా మరో కమెడియన్ కన్నుమూశారు. తమిళ్ నటుడు మరియు కమెడియన్ అయినటువంటి శేషు గుండెపోటుతో మరణించారు.

ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు. 10 రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి హాస్పటల్లో జాయిన్ చేశారు. ఇక ఈరోజు అనగా మంగళవారం నాడు ఈయన అనారోగ్య పరిస్థితి విషమించడంతో చివరి శ్వాస విడిచారు. లొల్లు సభ, పేరడీ సిరీస్ తో ఫేమస్ అయిన ఈయన ధనుష్.. తుళ్లువదో, ఇలామై, వేలయుధం,ఏ1 వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈయన చివరిగా సంతానం హీరోగా తెరకెక్కిన ” వడకుపట్టి రామస్వామి ” మూవీలో నటించారు. ఇక ప్రస్తుతం ఈయన కన్నుమూత వార్త విన్న ఈయన అభిమానులు నిరాశకు గురయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news