Movies"వద్దురా వద్దు రా అని మొత్తుకున్న వినలేదు".. ఉదయ్ కిరణ్ పై...

“వద్దురా వద్దు రా అని మొత్తుకున్న వినలేదు”.. ఉదయ్ కిరణ్ పై మురళి మోహన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఉదయ్ కిరణ్ .. ఈ పేరు చెప్పగానే ఎంతమంది ఆనందపడతారో కానీ వెంటనే తెలియకుండా కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆల్మోస్ట్ అందరి ఉదయకిరణ్ ఫాన్స్ కి వచ్చేస్తూ ఉంటుంది. చాలా చిన్న ఏజ్ లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్.. సూసైడ్ చేసుకొని మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

ఉదయ్ కిరణ్ గురించి ఎవర్ని కదిలించిన అందరూ ఆయన గురించి పాజిటివ్ గానే స్పందిస్తారు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం మురళీమోహన్ ఆయన గురించి అసలు విషయాన్నీ బయట పెట్టాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మురళీమోహన్ ఉదయ్ కిరణ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టీంట బాగా వైరల్ గా మారాయి. మురళీమోహన్ ని హోస్ట్ ప్రశ్నిస్తూ ఉదయ్ కిరణ్ జీవితంలో అసలు ఏం జరిగింది ..? సార్ అంటూ ప్రశ్నించగా..

” ఆ అబ్బాయికి కొంచెం హైపర్ టెన్షన్.. ఎక్కువ తరచు నన్ను కలుస్తూ ఉండేవాడు ..బిపి కూడా ఎక్కువగానే ఉండేది. ఎక్కువ టెన్షన్ పడిపోతాడు ..మనిషి కంట్రోల్ లో ఉండడు అది చాలా చాలా కష్టం ..మేమే ఒక దగ్గర డాక్టర్ కు చూయించాం.. ఆ డాక్టర్ ఉదయ్ కిరణ్ ను తమ్ముడిలా భావించి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు .. చాలా చాలా జాగ్రత్తలు చెప్పారు.. కూల్ గా ఉండాలి అని ఆవేశం తగ్గించుకోవాలి అని పదేపదే చెప్పేది.. కానీ ఉదయ్ కిరణ్ మేడం చెప్పినట్టే వింటాను అని చెప్పి ఆమె మాట వినేవాడు కాదు.. చాలా ట్రై చేసేవాడు ..కానీ కొన్ని సంఘటనలు ఆయనకు ఇష్టం లేకుండా జరిగినప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయిపోతాడు ..ఆ కారణంగానే ఉదయ్ కిరణ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది “అంటూ చెప్పుకొచ్చాడు . సోషల్ మీడియాలో మురళీమోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news