Moviesఫస్ట్ టైం విజయ్ దేవరకొండపై కోపంగా ఉన్న ఫ్యాన్స్.. రౌడీ హీరో...

ఫస్ట్ టైం విజయ్ దేవరకొండపై కోపంగా ఉన్న ఫ్యాన్స్.. రౌడీ హీరో అంత పెద్ద తప్పు ఏం చేశాడంటే..?

ఎస్ ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పై అభిమానులు కోపంగా ఉన్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం ఆయన ఒక బడా పాన్ ఇండియా డైరెక్టర్ ఆఫర్ ని రిజెక్ట్ చేయడమే. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ మంచి ఆఫర్ ని మిస్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు . ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విజయ్. కాగా విజయ్ గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

అయితే ఆ సినిమాని క్యాన్సిల్ చేసుకున్నట్లు తాజాగా సమాచారం అందుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో సినిమా అవకాశం కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు . మరి వచ్చిన అవకాశాన్ని విజయ్ దేవరకొండ ఎందుకు యుటిలైజ్ చేసుకోలేకపోయాడు. అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..? పుష్ప లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వదులుకున్నందుకుగాను విజయ్ దేవరకొండ అభిమానులు కోపంగా ఉన్నారు అంటూ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news