Moviesఅబ్బబ్బా..ఆ పాత్రలో ఎన్టీఆర్ నటించి ఉంటేనా.. చరిత్ర తిరగరాసి ఉండేవాడు..జస్ట్ మిస్..!!

అబ్బబ్బా..ఆ పాత్రలో ఎన్టీఆర్ నటించి ఉంటేనా.. చరిత్ర తిరగరాసి ఉండేవాడు..జస్ట్ మిస్..!!

జూనియర్ ఎన్టీఆర్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. బడా హీరో ..పాన్ ఇండియా హీరో .. మల్టీ టాలెంటెడ్ హీరో .. ఒకటా..? రెండా..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో బిరుదులు ఇవ్వాల్సి వస్తుంది . మరీ ముఖ్యంగా అన్నిటికన్నా మంచి మనసున్న హీరో .. ఫ్యాన్స్ ని కేవలం అభిమానుల చూడడం కాకుండా తన సొంత తమ్ముళ్లు లా ట్రీట్ చేస్తూ ఉంటారు .

ఈ విషయం ప్రతి ఒక్క నందమూరి అభిమానులకు తెలిసిన విషయమే . రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా కాంతారా. ఈ సినిమా ఎంత హ్యూజ్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు . ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో వస్తే చూసి ఎంజాయ్ చేసే జనాలు చాలామంది ఉన్నారు .

తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు . అయితే ఇక్కడే ఒక విషయం వైరల్ గా మారింది . ఈ సినిమాను రిషబ్ శెట్టి తెలుగులో రిలీజ్ చేయకుండా ఎన్టీఆర్ తో కనుక రీమేక్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని .. సూపర్ డూపర్ హిట్ కాదు ఒక చరిత్ర సృష్టించిండేది అని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా రిషబ్ శెట్టి మెప్పించిన పాత్రలో ఎన్టీఆర్ కనిపించి ఉంటే మాత్రం అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అని .. సినీ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని ఓపెన్ గా ఒప్పేసుకుంటూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యూచర్ లో ఇలాంటి పాత్రలు ఏదైనా వస్తే రిజెక్ట్ చేయకుండా చేస్తే బాగుంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్లో కాంతారా టైప్ ఉండే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడో ..? లేదో..? ప్రజెంట్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news