Moviesబిగ్ బ్రేకింగ్: చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డిన రాజమౌళి.. గతంలో...

బిగ్ బ్రేకింగ్: చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డిన రాజమౌళి.. గతంలో ఎన్టీఆర్ కి జరిగిన్నట్లే డిట్టో జరిగిందిగా..!!

ఎస్ ప్రెసెంట్ .. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళికి .. ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు సినిమాలను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు .

మరీ ముఖ్యంగా బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి . కాగా ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్లో విడుదల చేయగా సక్సెస్ఫుల్గా ఏడాదిన్నరగా థియేటర్లు రన్ అవుతుంది. ఈ క్రమంలోనే అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్ళాడు రాజమౌళి .అక్కడే ఆయన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

అక్కడ భారీ భూకంపం నుండి తృటిలో తప్పించుకున్నాడు రాజమౌళి . ఈ విషయాన్ని స్వయాన ఆయన కుమారుడు కార్తికేయ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. “ఓ బిల్డింగ్ లో 28వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైంది” అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు . “జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేము ఇప్పుడే చూసామంటూ కార్తికేయ చెప్పుకు రావడం ఇప్పుడు అభిమానులకి టెన్షన్ క్రియేట్ చేసింది “.

జక్కన్న తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. సేఫ్ జోన్ లో ఉన్నాడు అని తెలుసుకుని రాజమౌళి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతేకాదు త్వరగా మీరు ఆ జపాన్ నుంచి బయటకు రండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. గతంలో ఎన్ టీఆర్ సైతం ఇలానే జపాన్ లో భారీ భూకంపం నుండి తప్పించుకున్నాడు. ప్రజెంట్ మహేష్ బాబుతో .. రాజమౌళి ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు . దీనికి సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నాడు రాజమౌళి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news