Moviesసాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం .. మెగా ఫ్యాన్స్ కు...

సాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం .. మెగా ఫ్యాన్స్ కు కోలుకోలేని దెబ్బ..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా హీరోలు ఉన్నారు. నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలలో సగానికి పైగా ఉండే హీరోలు మెగా హీరోలే. అయితే అలా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారా..? అంటే నో అన్న సమాధానమే చెప్పాలి. చాలా తక్కువ మంది మాత్రమే స్టార్స్ గా మారారు . వాళ్ళల్లో ఒకరే సాయిధరమ్ తేజ్ . మెగా మేనల్లుడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి ధరంతేజ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయాడు .

మరి ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చూస్ చేసుకుంటాడు అన్న పేరు కూడా ఉంది. సాయిధరమ్ తేజ్ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా మారబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సాయిధరమ్ తేజ్ కి గతంలో యాక్సిడెంట్ అయింది . ఆయన హెల్త్ బాగా దెబ్బతినింది . కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడట . ఆయనకి ఇంటర్నల్ గా ఒక బిగ్ మేజర్ ప్రాబ్లం వచ్చిందట . దానికి సర్జరీ చేయించుకోవాలట . సర్జరీ చేయించుకున్నాక ఇదివరకట్లా డాన్స్ స్టెప్స్ వేయగలడు అన్న కాన్ఫిడెన్స్ అయితే డాక్టర్స్ ఇవ్వలేకపోతున్నారట . ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అంటూ సాయి ధరంతేజ్ నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇది నిజంగా మెగా అభిమానులకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news