Moviesదసరా విలన్ పెళ్లి చేసుకోబోతున్న ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే...

దసరా విలన్ పెళ్లి చేసుకోబోతున్న ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెడతారు..తోపులు కాదు అంతకు మించి..!!

2023లో అతిపెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏంటి అంటే అందరూ చెప్పే పేరు సలార్ . ఆ తర్వాత అందరికీ గుర్తొచ్చేది మాత్రం దసరానే. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్లు క్రాస్ చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ద్వారా నానికి ఎంత పేరు వచ్చిందో అలాగే విలన్ రోల్ లో నటించిన షైన్ టామ్ చాకోకు కూడా అంతే పేరు వచ్చింది .

ప్రెసెంట్ షైన్ టామ్ చాకో తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. మూడు కూడా బడా హీరో సినిమాలే కావడం గమనార్హం . ఇలాంటి క్రమంలోని రీసెంట్గా సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది . రీసెంట్గా తన గర్ల్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకున్నాడు ఈ దసరా విలన్. ప్రస్తుతం షైన్ టైం చాకో వయసు 40 సంవత్సరాలు . ఆల్రెడీ ఇతగాడికి పెళ్లయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు ఒక బిడ్డ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా తనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ విలన్. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. జంట చూడముచ్చటగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు తనూజ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. చాలా టాలెంటెడ్.. గోల్డ్ మెడలిస్ట్ అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో దసరా విలన్ కి కాబోయే భార్యకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news