Moviesమహేష్ బాబు ‘అతడు’ సినిమాలోని ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో...

మహేష్ బాబు ‘అతడు’ సినిమాలోని ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? అర్జున్ రెడ్డికి మించిపోయే హీరో..!!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మారిన బుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు . తేజ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఇప్పుడు సినిమాలలో హీరోగా నటిస్తున్నారు. అలాగే బలగం సినిమాతో కావ్య హీరోయిన్గా మారి వరస సినిమాలు ఆఫర్లు కొట్టేస్తుంది . ఇలా చాలామంది అదే కోవాలోకి వస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుడ్డోడి ఫోటో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన అతడు సినిమా గుర్తుంది కదా ..అయినా మరిచిపోయేటటువంటి సినిమా కాదులే అది . ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ..ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది ..బోర్ కొట్టదు ..త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ తో ఇప్పటికీ టీవీలో హై టి ఆర్ పి లతో బద్దలు కొడుతూ ఉంటుంది అతడు సినిమా . ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నే ఇక్కడ మీరు చూస్తున్న ఈ దీపక్ సరోజి .

సినిమాలో హీరో ఆ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది కూడా ఇతడే. అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు . అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు . కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సినిమా సిద్ధార్ధ్ రాయ్ . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా లాంచ్ చేశారు మేకర్స్ . ఈ ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే గుర్తొస్తున్నాయి . ఆ రేంజ్ లో బోల్డ్ కంటెంట్ లో చెలరేగిపోయాడు దీపక్ . ఒకప్పుడు చిన్నప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్న ఈ బుడ్డోడేనా..? మనం చూస్తున్న ఈ హీరో అనిపించేంత బోల్డ్ గా మారిపోయాడు . ప్రెసెంట్ దీపక్ సరోజి పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news