Moviesబిగ్ షాకింగ్: అనుష్క శెట్టికి ఘోర అవమానం.. ఇలా జరగాల్సిందే అంటున్న...

బిగ్ షాకింగ్: అనుష్క శెట్టికి ఘోర అవమానం.. ఇలా జరగాల్సిందే అంటున్న జనాలు..ఏమైందంటే..?

ఇది నిజంగా అనుష్క శెట్టి ఫ్యాన్స్ కు గుండెలు బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి. అనుష్క శెట్టి ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి ” సూపర్ ” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రెసెంట్ పలు సినిమాలలో నటించడానికి ట్రై చేస్తుంది. నిశ్శబ్దం తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని చేసిన మూవీ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకునింది .

కలెక్షన్స్ పరంగా కూడా బాగా సాటిస్ఫై చేసింది . స్టాండ్ అప్ కమెడియన్ గా నవ్విస్తూ అనుష్కతో కలిసి ఎమోషనల్ గా మెప్పించాడు నవీన్ పోలిశెట్టి . వీళ్లిద్దరికి ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా పండించారు. కాగా ఈ సినిమా ఓటిటిలో కూడా రిలీజ్ అయింది . బహుశా ఓటీటీ ప్రభావం వల్లే టీవీలో ఈ చిత్రం ఫ్లాప్ అయింది అంటున్నారు సినీ విశ్లేషకులు .

గతవారం తొలిసారి ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేశారు . అయితే చాలా దారుణాతి దారుణంగా 3.2 టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకోవడం అనుష్కకు భారీ అవమానంగా చెప్తున్నారు జనాలు . అనుష్క క్రేజ్ కి ఇది పరమ చెత్త టీఆర్పీ రేటింగ్స్ అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అనుష్కకు ఇలా జరగాల్సిందే అని ..అందుకే ఆమె ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా కొంచెం కొంచెంగా సినిమాలు చేస్తూ ఉంటే ఆమె సినిమాలు బాగా రేటింగ్స్ దక్కించుకుంటాయి అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news