Movies2024లో ఒక్కే నిర్ణయం తీసుకుని స్టార్ హీరోలకి చెమటలు పట్టిస్తున్న ముద్దుగుమ్మలు...

2024లో ఒక్కే నిర్ణయం తీసుకుని స్టార్ హీరోలకి చెమటలు పట్టిస్తున్న ముద్దుగుమ్మలు వీళ్లే..!!

2024 లో ఈ ముద్దుగుమ్మలు తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. జనరల్ గా సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా స్టార్ హీరోలనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. స్టార్ హీరోల పరంగానే మార్కెట్ బాగా వస్తుంది అని మేకర్స్ కి లాభాలు వస్తాయి అని జనాల అభిప్రాయం. అయితే వాటిని తప్పు అంటూ ప్రూవ్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. 20 24 లో ఈ హీరోయిన్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

హీరోలతో సంబంధం లేకుండా కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. పూజ హెగ్డే లేటెస్ట్ గా ఓ బోల్డ్ వెబ్ సిరీస్ కి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఆమె బోల్డ్ పాత్ర చేయబోతుందట. అలాగే కీర్తి సురేష్ కూడా లేడీ ఓరియంటెడ్ పాత్రలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందట . ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ హిట్ కొట్టిందే లేదు. అంతేకాదు బోల్డ్ గా నటించడానికి కూడా ఓప్పేసుకుందట.

అంతేకాదు రష్మిక మందన్నా.. సైతం ది గర్ల్ ఫ్రెండ్ , రెయిన్బో సినిమాలతో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది . కాగా సమంత ముందు నుండి కూడా నాకు హీరోలతో పనిలేదు అంటూ కేవలం ఆమె లేడి ఓరియెంటెడ్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకుంటూ వస్తుంది . అలా ఈ ముద్దుగుమ్మలు మాకు హీరోలతో అవసరం లేదు అంటూ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో ఈ ముద్దుగుమ్మాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news