Moviesస్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుక్క పట్టి ఏడుస్తున్న పాయల్...

స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. గుక్క పట్టి ఏడుస్తున్న పాయల్ రాజ్ పుత్(వీడియో)..!! c

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు . ప్రెసెంట్ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటి సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ మరి ఏ హీరోయిన్ నటించలేదని చెప్పాలి .

తొలి సినిమాతోనే ఇంత రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయిన ఈ అమ్మడు ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేస్తుంది అని అంతా అనుకున్నారు . ఎంత బోల్డ్ మూవీస్ చేసిన ఆ తర్వాత జనాలను మెప్పించలేకపోయింది . రీసెంట్గా వచ్చిన మంగళవారం తో మాత్రం మంచి సక్సెస్ అందుకుంది . కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్.. రీసెంట్గా పెట్టిన పోస్ట్ అభిమానులను కలచివేస్తుంది .

ఆమె తన పెట్ డాగ్ ని కోల్పోయింది . ఆమె ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ క్యాండీ మరణంతో ప్రస్తుతం దుఃఖంలో ఉంది . ఈ మేరకు తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ..”క్షమించు క్యాండీ.. ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది.. నాకు ఎంతో బాధగా ఉంది ..గుండెలు పగిలిపోతున్నాయి .. నువ్వు లేకుండా నేను ఉండలేను.. నీ హాగ్స్ నీ ప్రేమను మిస్ అయిపోతున్నాను.. ఐ మిస్ యు “అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది . ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news