Moviesఆ విషయంలో గట్టి గట్టిగా అరుచుకున్న ప్రభాస్-రాజమౌళి..అరుదైన (వీడియో) వైరల్‌..!!

ఆ విషయంలో గట్టి గట్టిగా అరుచుకున్న ప్రభాస్-రాజమౌళి..అరుదైన (వీడియో) వైరల్‌..!!

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలో ఎంత హై స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలు ఇంకా మాట్లాడాలి అంటే పాన్ ఇండియా హీరోలకి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు . అలాంటి జక్కన్న ఓ స్టార్ హీరోతో గొడవపడ్డాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇది మొత్తం ఫన్నీ గానే జరిగిన జనాలు చాలా సరదాగా ఈ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా “ఛత్రపతి”. ఈ సినిమా ఎన్ని అవార్డుల అందుకుంది ..ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాతో కాంపిటీషన్ కి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చిత్తగా ఓడిపోయాయి . కాగా ఛత్రపతి టైం లో ప్రమోషన్స్ చేస్తున్న ప్రభాస్ రాజమౌళికి సంబంధించిన ఫన్నీ ఇంటర్వ్యూ తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొదట రాజమౌళి – ప్రభాస్ ఈ సినిమా హిట్ అయింది అంటే కారణం మీరంటే మీరు అంటూ బాగా పొగుడుకుంటారు . అక్కడ నుంచి పక్క రూములోకి వెళ్ళాక తన టీం తో మాట్లాడుతూ రాజమౌళి ..”ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎవరు కారణం ఎవరు ..జనాల్లోకి సినిమాని ఎక్కువగా ఎవ్వరు తీసుకెళ్లారు అంటే రాజమౌళిని అంటారు వాళ్ళు.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా అదే అంటారు “..

అయితే అప్పుడే ప్రభాస్ వచ్చి ..”ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ప్రభాస్ టీం మీరే సార్ అంటారు.. ఇలా ఇద్దరికి ఇద్దరు సినిమా హిట్ అవ్వడానికి మేము కారణమంటే మేము “అంటూ చెప్పుకునే ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మొత్తానికి ఈ వీడియో ద్వారా ప్రభాస్ జక్కన్న ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మరోసారి అర్థమయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news