Moviesబాల‌కృష్ణ గెస్ట్ రోల్స్ చేసిన రెండు తెలుగు సినిమాలు ఇవే...!

బాల‌కృష్ణ గెస్ట్ రోల్స్ చేసిన రెండు తెలుగు సినిమాలు ఇవే…!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాలలో నటించారు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా 109వ సినిమా. ఇక బాలయ్య తన కెరీర్‌లో రెండు సినిమాలలో అతిధి పాత్రలలో నటించారు. ఆయన గౌరవ పాత్రలో నటించిన తొలి సినిమా మొనగాడు. అర్జున్ హీరోగా ఎస్. బి.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన మొనగాడు సినిమాలో క‌థానుసారం హీరో బాలకృష్ణకు.. అర్జున్ డూప్ గా నటిస్తూ స్టంట్ మాస్టర్ గా పేరుపొందుతాడు. ఈ పాత్రలో అర్జున్ అద్భుతంగా నటించాడు.

మరో హీరో సుమన్ కూడా గెస్ట్ రోల్‌లో మెరిశాడు. మొనగాడు సినిమాలో రజిని హీరోయిన్.. సెంటిమెంట్, క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 1986లో ఇది రిలీజ్ అయింది. అలాగే హీరో బాలకృష్ణ త్రిమూర్తులు సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నటించారు. ప్రముఖ పారిశ్రమికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి భారీ బడ్జెట్ తో విక్టరీ వెంకటేష్ హీరోగా కె.మురళీమోహన రావు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు.

హిందీలో సూపర్ హిట్ అయిన నసీబ్ సినిమా ఆధారంగా త్రిమూర్తులు తెరకెక్కింది. ఈ సినిమాలో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్, కుష్బూ, శోభన, అశ్విని నటించారు. బాలకృష్ణ అతిధి పాత్రలో నటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అలాగే ఒక పాటలో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా కనిపిస్తారు. త్రిమూర్తులు సినిమా 1987లో రిలీజ్ అయింది. అలా బాలకృష్ణ తన కెరీర్‌లో ఈ రెండు సినిమాలలో అతిధిపాత్రలలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news