Moviesపింక్ క‌ల‌ర్ చీర‌లో సురేఖ‌వాణి ఏం క‌వ్విస్తోందిరా... ఆమె అందాలు చూస్తారా...!

పింక్ క‌ల‌ర్ చీర‌లో సురేఖ‌వాణి ఏం క‌వ్విస్తోందిరా… ఆమె అందాలు చూస్తారా…!

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడిగా.. అమ్మగా, అక్కగా, అత్తగా నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఆమె అచ్చ తెలుగు ఆడపడుచు. విజయవాడకు చెందిన సురేఖ వాణి చిన్న వయసులోనే వయసుకు మించిన పాత్రలలో నటించి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తూ ఉంటారు. అటు భర్త లేకపోయినా.. ఆమె కూతురు సుస్మిత కూడా 22 ఏళ్ళ వయసులో ఉన్నా.. సురేఖవాణి కూతురుతో కలిసి అందరు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తూ ఉంటుంది.

బీచ్ ఒడ్డున‌ ఈ తల్లి కూతుర్లు హాట్ హాట్ డ్రెసుల‌తో చేసే అందాల ఆరబోత‌కు అంతే ఉండదు. విచిత్రం ఏమిటంటే కూతురు పక్కన ఉండగా ఆమె మందు గ్లాసుతో ఫోజులు ఇస్తూ ఉంటుంది. సినిమాల్లో కాస్త డీ గ్లామరస్‌గా కనిపించినా కూడా సోషల్ మీడియాలో ఆమె ఒరిజినల్ అందం చూస్తే మామూలుగా ఉండదు. నాలుగున్నర ప‌దుల వయసులోనూ ఆమె నాజుకు అందం మైంటైన్ చేసే తీరు అద్భుతం అని చెప్పాలి. ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాలు కాస్తు తగ్గినా కూడా.. సోషల్ మీడియాలో ఆమె సందడి కొనసాగుతూనే ఉంటుంది.

తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా సురేఖ తన అందంతో అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. సాధారణంగా చీరకట్టులో సురేఖవాణి చాలా అందంగా ఉంటుంది. అలాంటిది లైట్ పింక్ కలర్ చీరలో సురేఖ సన్నగా నాజూకుగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సురేఖ వాణి ఫోటోలు వైరల్ అయినట్టుగా.. ఆమె చీరకట్టులో ఫోటోలకు ఫోజు ఇస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

కొద్ది రోజుల క్రితం సురేఖ కూతురు సుస్మిత కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. సురేఖ వాణికి ఉన్న క్రేజ్, మంచి పేరు నేపథ్యంలో సుప్రీతకు టాలీవుడ్ లో గ్రాండ్‌గా వెల్కమ్ దక్కే ఛాన్సులు ఉన్నాయి. సురేఖ కూడా తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేయాలి అనుకుంటుందని.. అందుకే ఆమెతో అదిరిపోయే హాట్ షోలు చేస్తుందన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news