Moviesశ్రియా రెడ్డికి క్రికెటర్ దినేష్ కార్తీక్ తో ఉన్న రిలేషన్ ఏంటో...

శ్రియా రెడ్డికి క్రికెటర్ దినేష్ కార్తీక్ తో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..? సలార్ హిట్ తో బయటపడ్డ అసలు నిజం..!

సలార్ .. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేస్తుంది . రెండు రోజుల్లోనే లాభాల వర్షం కురిపిస్తున్న సలార్ సినిమాకి సంబంధించిన నటీనటుల డీటెయిల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. కాగా సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించిన కొందరి నటీనటుల డీటెయిల్స్ కు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాధా రామ పాత్రలో నటించిన బ్యూటీ శ్రియా రెడ్డి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శ్రియా రెడ్డి కోలీవుడ్ నటి. ఆమె భర్త కూడా కోలీవుడ్ సినిమాల్లో వర్క్ చేశాడు. కోలీవుడ్ లో వీజే గా విక్రమ్ కెరియర్ స్టార్ట్ చేశారు . శ్రియా కూడా కెరియర్ స్టార్టింగ్ లో వీజే గానే పనిచేయడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విశాల్ కంటే ముందే విక్రమ్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు . నటుడుగా తక్కువ సినిమాల్లో కనిపించిన ఆ తర్వాత జీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసి పలు సినిమాలను నిర్మించాడు .

విశాల్ సినిమాలన్నీ ఆయన నిర్మించడం గమనార్హం . అంతేకాదు శ్రేయ రెడ్డికి క్రికెట్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం ఉంది . శ్రేయ రెడ్డి తండ్రి భరత్ రెడ్డి చెన్నైలో జన్మించారు . అంతర్జాతీయ స్థాయి టీమిండియా జట్టు తరఫున ఎన్నో మ్యాచ్లో రాణించారు. 1978 – 1981 మధ్య పాకిస్తాన్ , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ పై 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో వికెట్ కీపర్ గా కొనసాగారు . ఆ తర్వాత తమిళనాడు కు కెప్టెన్ గా కూడా ఉన్నారు . క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రెడ్డి కాంప్లెక్స్ లో పనిచేశారు. చెన్నైలో క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడంలో సహాయపడ్డారు. అతను భారత్ టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్ కి లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆ టైం లోనే శ్రియా రెడ్డి వాళ్లకి మంచి ఫ్రెండ్ గా మారిపోయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news