Movies‘ హనుమాన్ ’ : సెన్సార్ & రన్ టైం లాక్......

‘ హనుమాన్ ’ : సెన్సార్ & రన్ టైం లాక్… !

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ న‌టుడు తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ హనుమాన్ . ఈ భారీ యాక్షన్ సినిమాలో అమృత్ అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలలో న‌టించారు. హ‌నుమాన్ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నిరంజన్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

ఈ సినిమా నుంచి ఇటీవ‌లే రిలీజ్ అయిన సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ ఆక‌ట్టుకుని సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప‌లుసార్లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. సంక్రాంతి రేసు నుంచి కూడా ఈ సినిమాను త‌ప్పించాల‌ని ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేదు.

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి హ‌నుమాన్ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. అలానే ఈ మూవీ రన్ టైం 2 గం. 38. ని. లుగా ఉంటుంద‌ట‌. అంటే మొత్తం 158 నిమిషాల పాటు ఈ సినిమా ర‌న్ టైం ఉంటుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాష‌ల‌తో పాటు ప‌లు అంత‌ర్జాతీయ భాష‌ల‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక గుంటూరు కారం రిలీజ్ అవుతోన్న జ‌న‌వ‌రి 12నే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news