Newsవ‌రుణ్ - లావ‌ణ్య హ‌నీమూన్‌కు ఎంత క‌ష్టం వ‌చ్చిందిరా బాబు...!

వ‌రుణ్ – లావ‌ణ్య హ‌నీమూన్‌కు ఎంత క‌ష్టం వ‌చ్చిందిరా బాబు…!

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంట పెళ్లి ఇటీవల ఇటలీలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట విదేశీ వెకేషన్స్‌కి వెళ్ళటం ఇప్పుడు హాట్‌ టాపిక్. ఇది హనీమూన్ వెకేషన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీరి హనీమూన్ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నూతన వధూవరులు ఇట‌లీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఇప్పుడు ఈ జంట లండన్ వెకేషన్ నుంచి కొన్ని అరుదైన ఫోటోలు షేర్ చేశారు.

లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ లో లండన్ హాలీడే నుంచి ఫోటో వీడియో షేర్ చేశారు. లండన్ వింటర్ వండర్లాండ్ నుంచి ఒక వీడియో షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంచు శిల్పాల మధ్యలో ఈ జంట కనిపించగా చలిలో వీరిద్దరూ వ‌ణికిపోతున్నట్టుగా కనిపిస్తోంది. లావణ్య పోస్ట్ చేసిన మరో ఫోటోలో వరుణ్ తేజ్ ఐస్‌క్రీమ్‌ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక మొత్తం మంచు కొండల మధ్యలో వరుణ్ స్వెటర్, మంకీ క్యాప్ ధరించి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా ఉంది. లావణ్య కూడా మంకీ క్యాప్‌ పెట్టుకుని చలికి వణికిపోతున్నట్టు చెంపన చేయి వేసుకుంది.

ఇక నెటిజన్లు అయితే లావణ్య – వరుణ్ హనీమూన్ కు మంచు రూపంలో పెద్ద కష్టమే వచ్చిందే అని సరదాగా ఆట పట్టిస్తున్నారు. లావణ్య తన సోషల్ మీడియాలో ఇలా రాసింది. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన దయగల శ్రద్దగల వ్యక్తి ఇప్పుడు నా భర్త. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ.. దానిని మన మధ్య ఉంచుదాం. మా పెళ్లితో ఈ కుటుంబాలు.. ప్రియమైన వారితో కలిసి ఉండాలని మేము కలలు కన్నా ప్రతిదీ సాధ్యమైంది. ఈరోజును నాకు చాలా స్పెషల్గా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞురాలని.. అని రాసింది. ఇక వీరిద్దరూ 2016 నుంచి ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news