Movies' అఖండ 2 ' పై మూడు అదిరిపోయే అప్‌డేట్లు వ‌చ్చేశాయి.....

‘ అఖండ 2 ‘ పై మూడు అదిరిపోయే అప్‌డేట్లు వ‌చ్చేశాయి.. బాల‌య్య ఫ్యాన్స్‌కు ఖ‌త‌ర్నాక్ న్యూస్‌

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. ముఖ్యంగా అఖండ బాలకృష్ణ కెరీర్‌కు ఎంతలా ఊపిరిచ్చిందో చెప్పక్కర్లేదు. అఖండతో మొదలుపెట్టిన బాలయ్య వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేస‌రి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టుకుంటూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుంచి ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను అఖండ 2 పై గత ఐదు, ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మూడు అదిరిపోయే అప్డేట్లు బయటికి వచ్చాయి. నిజంగా బాలయ్య అభిమానులకు ఇవి మామూలు కిక్ ఇచ్చే అప్డేట్‌లు కావు. అఖండ 2 స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం మాటల రచయిత ఎం.రత్నం డైలాగులు రాస్తున్నాడని తెలుస్తోంది.

జనవరి చివరి నాటికి డైలాగ్ వర్షన్ కూడా కంప్లీట్ అవుతుందట. ఈ కథలో సోషియాఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ లైన్‌ చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో డిఫ‌రెంట్‌ సినిమా రాబోతుందని టాక్. అలాగే సినిమాలో బోయపాటి మార్క్‌ యాక్షన్ సీన్స్, పొలిటికల్ పంచ్‌లు సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య – బాబి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అఖండ 2 సెట్స్ మీదకు వెళ్ళ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news