Movies' దేవ‌ర‌ ' లో విల‌న్ త‌ల న‌రికే సీన్ ఇది......

‘ దేవ‌ర‌ ‘ లో విల‌న్ త‌ల న‌రికే సీన్ ఇది… గూస్ బంప్స్ మోత‌… అరుపులు కేక‌లే…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవర సముద్ర నేపథ్యంలో జరుగుతుందన్న‌ విషయం తెలిసిందే. ఈ సినిమాలో చాలా హైలెట్ సీన్లు ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సీన్ అయితే సినిమాకే హైలెట్గా నిలవబోతుందని సమాచారం. ఇంటర్వెల్ బ్యాక్‌లో గంగమ్మ జాతరలో ఎన్టీఆర్ గంగమ్మ తల్లి భక్తుడుగా కనిపిస్తాడట.

అప్పుడు ఎన్టీఆర్ నటన టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందట. ఈ జాతర ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ విలన్లలో ఒకడి తల నరికే సీన్ ఉంటుందని.. అది టోటల్ అల్టిమేట్ గా ఉండబోతుందని.. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడబోతున్నామని తెలుస్తోంది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఎంతలా విజృంభిస్తాడో ? ఇప్పటికే చాలాసార్లు చూశాం. మరోసారి దేవరలో తన నటనతో అదరగొట్టేస్తాడట.

ఎన్టీఆర్‌కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. దేవర రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news