News"శ్రీవల్లి" పాటలో ఆ చెప్పు స్టెప్ దేనిని చూసి క్రియేట్ చేశారో...

“శ్రీవల్లి” పాటలో ఆ చెప్పు స్టెప్ దేనిని చూసి క్రియేట్ చేశారో తెలుసా.. సుకుమార్ కాళ్లకి దండం పెట్టాల్సిందే..!!

“పుష్ప ది రైజ్”.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాకి గాను బన్నీ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు సైతం అందుకున్నాడు . ఇలాంటి క్రమంలోనే పుష్ప సినిమాకి సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే రీసెంట్గా అమితాబచ్చన్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలో బన్నీ వేసిన స్టెప్ గురించి మాట్లాడారు . ఈ క్రమంలోనే అసలు ఈ స్టెప్ ఎలా క్రియేట్ చేశాడు సుకుమార్ అనే విషయం వైరల్ అవుతుంది. చాలా సింపుల్ గా ఈ స్టెప్ క్రియేట్ చేశారట సుకుమార్. సినిమా షూట్ చేస్తూ ఉండగా అటువైపుగా కొందరు పిల్లలు చొప్పులు తెగిపోయి అదే చెప్పులతో కష్టపడుతూ నడుస్తూ వెళ్తున్నారట .

దీంతో అదే తన మైండ్లో పెట్టుకున్న సుకుమార్ ఇదే స్టెప్ గా వేస్తే బాగుంటుంది అంటూ కొరియోగ్రాఫర్ కి సజెస్ట్ చేశారట . సుకుమార్ తన లోని క్రియేటివిటీని బయటకు తీసి ఈ స్టెప్ ని కంపోజ్ చేయించాడు . ఈ స్టెప్ ఎంత హైలైట్ అయిందో మనకు బాగా తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలో ఎన్నో పాటలు ఉన్న ఈ పాటని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు ..ఈ స్టెప్ కూడా అంతే హైలెట్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news