Newsనాగ‌శౌర్య భార్య అనూష అప్పుడే అత్త‌ను ప‌క్క‌కు తోసేసిందా...!

నాగ‌శౌర్య భార్య అనూష అప్పుడే అత్త‌ను ప‌క్క‌కు తోసేసిందా…!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అనూష శెట్టి వివాహం గత ఏడాది నవంబర్‌లో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెకేషన్లు, హనీమూన్లు అంటూ ఈ జంట అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసేది. పెళ్లి తర్వాత సినిమా, ఫ్యామిలీ లైఫ్ ని పూర్తిగా సపరేట్ చేసిన నాగశౌర్య ఇంటికొస్తే చాలు ఫ్యామిలీ స్టార్లా మారిపోతాడట. ఇక నాగశౌర్య భార్య.. అనూష శెట్టి కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకునేందుకే ప్రయార్టి ఇస్తుంటారు.

తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ భార్యాభర్తలు దిగిన ఒక ఫోటోని నాగశౌర్య తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో నాగశౌర్య నలుపు రంగు దుస్తుల్లో ఉండగా.. అనూష పసుపు రంగు ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు సరదాగా దిగిన ఫోటో ఇది. బ్యాక్ గ్రౌండ్లో ఇల్లు చూస్తే ఎంతో గ్రాండియ‌ర్ లుక్‌లో కనిపిస్తుంది. అనూష అయితే తన భర్త నాగశౌర్య బిగి కౌగిలిలో బందీ అయిపోయి.. ఎంతో హ్యాపీగా కనిపిస్తోంది. ఇక నాగశౌర్య తల్లి ఉష మూల్పూరీ మంచి ఇంటీరియర్ టేస్ట్ ఉన్న మహిళ.

ఇంటిని ఎలా చక్కదిద్దాలో ఆమెకు బాగా తెలుసు. ఇంటి మొత్తాన్ని ఆమె డెకరేట్ చేస్తూ ఉంటారు. ఆమె టేస్ట్ తెలిసిన ఇండస్ట్రీ జనాలు అంతా ఆమె మంచి ఇంటీరియర్ డిజైనర్ అని చెబుతూ ఉంటారు. ఇక పెళ్లికి ముందు తనయుడితో ఎక్కువగా కనిపించే ఆమె పెళ్లి తర్వాత తనయుడితో కలిసి కనిపించిన సందర్భాలు తక్కువ. దీంతో కొందరు నెటిజన్లు సరదాగా మొత్తానికి శౌర్య.. భార్యా వచ్చాక అమ్మను సైడ్ చేసేసాడు.. అనూష భర్తను అత్తగారి కంట్రోల్ నుంచి తన కంట్రోల్ లోకి తెచ్చేస్తుందని.. సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news