Moviesఇలియానా త‌ల్ల‌య్యాక హీరోయిన్ ఛాన్సుల కోసం ఫోన్లు... దిమ్మ‌తిరిగే రిప్లేలు వ‌స్తున్నాయా..!

ఇలియానా త‌ల్ల‌య్యాక హీరోయిన్ ఛాన్సుల కోసం ఫోన్లు… దిమ్మ‌తిరిగే రిప్లేలు వ‌స్తున్నాయా..!

గోవా బ్యూటీ ఇలియానా మళ్ళీ సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ అడుగుతుందట. దేవదాస్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బక్కపలచని బ్యూటీ మొదటి సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

దాంతో తెలుగులో రవితేజ, రానా, మంచు విష్ణు, ప్రభాస్ లాంటి స్టార్స్ తో నటించే అవకాశం అందుకుంది. హిందీలో కూడా బర్ఫీ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయినా హిందీలో అజయ్ దేవగన్ తో వరుస అవకాశాలు అందుకుంది. చెప్పాలంటే ఇలియానాకి తెలుగులో అవకాశాలు తగ్గగానే బాలీవుడ్ ఆదుకుంది.

అదే సమయంలో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తూ రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసింది. ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, డిజాస్టర్ అవడంతో మళ్ళీ ఈ గోవా బ్యూటీ కనిపించలేదు. హిందీలో సినిమాలు చేస్తుండగానే ఇలియానా తల్లైంది. ఇది చాలామందికి షాకిచ్చిన విషయం.

అసలు ఇలియానా లవర్ ఎవరు..ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాలేవి బయటకి రాకుండానే డైరెక్ట్ గా ప్రగ్నెంట్ అని ఆ తర్వాత బిడ్డకి జన్మనిచ్చానని గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తాజాగా ఓ నెటిజన్ మీరు సింగిల్ పేరేంటా అని అడిగినందుకు తన లైఫ్ పార్ట్నర్ ఫొటోను షేర్ చేసి పరిచయం చేసింది. ఇప్పుడు ఇలియానా మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటుందట. అందుకే, తనకి క్లోజ్ గా ఉన్న నిర్మాతలకి దర్శకులకి ఫోన్ చేసి అడుగుతుందట. మరి ఎంతవరకూ ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news