Newsమ‌హేష్ రామ్‌చ‌ర‌ణ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే గెలిచేది ఆ హీరోనే...!

మ‌హేష్ రామ్‌చ‌ర‌ణ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే గెలిచేది ఆ హీరోనే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు, రామ్ చరణ్ లకు ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఇద్దరు హీరోలు ఇతర భాషలలో సైతం బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

అయితే రామ్ చరణ్ ,మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సందర్భాలలో పోటీ పడడం జరిగిందట. చాలా సందర్భాలలో పై చేయి రామ్ చరణ్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అలా 2013 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్, వెంకటేష్ రాగా..రామ్ చరణ్ నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు హిట్గా నిలిచిన నాయక్ సినిమాదే పై చేయి సాగిందట.

గోదావరి జిల్లాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నది. ఇక 2014లో రామ్ చరణ్, మహేష్ మధ్య మళ్లీ పోటీ నెలకొంది. రామ్ చరణ్ ఎవడు సినిమాతో రాగా మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలలో మళ్లీ రామ్ చరణ్ దే పైచేయి అందుకున్నారట.. అదే ఏడాది మళ్లీ ఆగడు గోవిందుడు అందరి వాడేలే సినిమాతో మహేష్ రామ్ చరణ్ మధ్య పోటీ నిలువగా మళ్లీ రామ్ చరణ్ దే పైచేయి అయ్యింది.

ఆ తర్వాత మళ్లీ భరత్ అనే నేను – రంగస్థలం సినిమాలు 20 రోజుల వ్యవధిలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించాయి. అయితే ఎన్నోసార్లు మహేష్ రామ్ చరణ్ పోటీపడ్డ రామ్ చరణ్ కు మాత్రమే అనుకూలమైన ఫలితాలు రావడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news