Newsఓర్ని దుంప తెగ.. పబ్లిక్ లో ఈ పనులు ఏంట్రా సామీ.....

ఓర్ని దుంప తెగ.. పబ్లిక్ లో ఈ పనులు ఏంట్రా సామీ.. సల్మాన్ ఖాన్ మహా చిలిపి..!!

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా టైగర్ 3 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు సల్మాన్ ఖాన్. టైగర్ త్రీ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా అక్కడ డైరెక్ట్ గా నటుడిని హగ్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే .

కాగా రీసెంట్గా మరోసారి అలాంటి ప్రవర్తనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు సల్మాన్ ఖాన్ . రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 54వ ఎడిషన్ లో పాల్గొన్నారు. నవంబర్ 21 .. 2023 మంగళవారం సాయంత్రం ఫిలిమ్ ఫెస్టివల్ లో ఘనంగా సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు .

ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తన మేన కోడలు అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు . రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . కాగా అంతా సరదాగా సాగిపోతున్న క్షణంలో సల్మాన్ ఖాన్ ఓ సీనియర్ జర్నలిస్టును ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసాడు . ఇది చాలా ఫ్రెండ్లీగా హాస్యాస్పదంగా.. తమాషాగా జరిగింది . కానీ కొందరు మాత్రం సల్మాన్ ఖాన్ తీరుపై మండిపడుతున్నారు . ఈ పద్ధతి ఏంటి రా బాబు కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దు పెట్టేస్తున్నావ్ ..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news