News' స‌లార్ ' ట్రైల‌ర్ రిలీజ్‌కు ముందు ఇండియ‌న్ సినీ ఫ్యాన్స్‌కు...

‘ స‌లార్ ‘ ట్రైల‌ర్ రిలీజ్‌కు ముందు ఇండియ‌న్ సినీ ఫ్యాన్స్‌కు బిగ్ డిజ‌ప్పాయింట్ న్యూస్‌…!

పాన్ ఇండియా స్టార్, యంగ్‌రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా… శృతి హాసన్ హీరోయిన్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా స‌లార్‌. అస‌లు స‌లార్ సినిమా కోసం ఆడియెన్స్ ఇండియా వైడ్‌గా ఎలా వెయిట్ చేస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. అస‌లు క‌ళ్లుకాయ‌లు కాచేలా ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ స‌లార్ కోసం ఆతృత‌గా ఉన్నారు.

ఇక ఈ సినిమా ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్య కార‌ణాల వ‌ల్ల క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో స‌లార్ రిలీజ్ అవుతోంది. ఇక ట్రైల‌ర్ రిలీజ్ అవుతుండ‌డంతో సినిమాపై నెక్ట్స్ లెవ‌ల్ హైప్ నెల‌కొంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఓ విష‌యంలో బాగా డిజ‌ప్పాయింట్‌తో ఉన్నారు.

సినిమా ట్రైల‌ర్ వ‌స్తున్నా అస‌లు సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన పోస్ట‌ర్లు బ‌య‌ట‌కు రాలేదు. ఏదో ప్ర‌భాస్ కు సంబంధించిన ఒక‌టి, రెండు స్టిల్స్ మిన‌హా అస‌లు స‌లార్ నుంచి ద‌మ్మున్న పోస్ట‌ర్ ఒక్క‌టి కూడా బ‌య‌ట‌కు రాలేదు. సినిమాపై ఉన్న హైప్‌న‌కు మేక‌ర్స్ ఇస్తోన్న ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు అస్స‌లు మ్యాచ్ కావ‌డం లేద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది.

ఏదేమైనా క‌నీసం ట్రైల‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత నుంచి అయినా మంచి అగ్రెసివ్ ప్ర‌మోష‌న్ల‌తో పాటు స‌రికొత్త కంటెంట్ మెటీరియ‌ల్‌తో సినిమాపై హైప్ మ్యాచ్ అయ్యేలా చేస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news