News' యానిమ‌ల్ ' అడ్వాన్స్ బుకింగ్‌... ఒక్కో టిక్కెట్టు రేటు అన్ని...

‘ యానిమ‌ల్ ‘ అడ్వాన్స్ బుకింగ్‌… ఒక్కో టిక్కెట్టు రేటు అన్ని వేలా…!

ఒక్క టిక్కెట్ రేటు రు. 2400 అంటే న‌మ్మ‌క‌పోవ‌చ్చు. ఇదేదో బ్లాక్‌లో కాదు… డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే.. ఇది ఏ సినిమా టిక్కెట్ రేటో తెలుసా యానిమ‌ల్ టిక్కెట్ రేటు. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, క‌న్న‌డ క్రేజీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న జంట‌గా తెర‌కెక్కిన యానిమ‌ల్ సినిమా డిసెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అస‌లు ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

అస‌లు దేశ‌వ్యాప్తంగా మ‌ల్టీఫ్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు భారీ ఎత్తున న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు అయితే యూత్‌కు మాంచి కిక్ ఇస్తున్నాయి. అస‌లు థియేట‌ర్ల‌లో సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా ? అన్న ఉత్కంఠ‌తో ఉన్నారు. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తుల‌తో సినిమాపై ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు టిక్కెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారు.

ఢిల్లీలో ప‌లు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో రీ క్లెయిన‌ర్ టిక్కెట్ రేటు ఏకంగా రు. 2400 ప‌లుకుతోంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. యానిమ‌ల్ సినిమాకు సంబంధించి దేశంలోనే ఇది టాప్ రేటు. ఇక ముంబై, ఢిల్లీలో ప‌లు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో టిక్కెట్ రేటు క‌నీసం రు. 550కు త‌గ్గ‌కుండా ఉంది. ముంబైలో గ‌రిష్ట ధ‌ర రు. 2200 గా ఉంది.

ఇక సౌత్‌లో బెంగ‌ళూరులో కూడా ఇప్పుడు ఉన్న రేట్ల‌కు అద‌నంగా 30 – 35 శాతం పెంచేశారు. హైద‌రాబాద్‌లో మాత్రం మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో మామూలు రేట్లు న‌డుస్తున్నాయి. ఇక తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో తెలుగు నాట కూడా ఈ సినిమాకు మామూలు క్రేజ్ లేదు. పైగా అంద‌రికి తెలిసిన హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న ఉండ‌డం మ‌రో ప్ల‌స్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news