Newsబాల‌య్య 109వ సినిమాకు ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు ఈ లింక్ ఉందా..!

బాల‌య్య 109వ సినిమాకు ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు ఈ లింక్ ఉందా..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “భగవంత్ కేసరి” . అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో వ‌రుస‌గా మూడో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. అస‌లు బాల‌య్య ఇప్పుడు మామూలు ఫామ్‌లో లేడు. ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షో కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొడుతోంది.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బాబి కొల్లి ఇప్పుడు బాల‌య్య‌ను డైరెక్ట్ చేస్తుండ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇది బాల‌య్య స్టైల్‌కు కాస్త భిన్నంగా ఉండ‌డంతో పాటు సెకండాఫ్‌లో పొలిటిక‌ల్ ఎలిమెంట్స్‌, పొలిటిక‌ల్ ప్లాష్‌బ్యాక్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఓ మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో బాబీడియోల్ క్లారిటీ కూడా ఇచ్చేశాడు. తాను మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తున్నాన‌ని చెప్ప‌డంతో అది బాల‌య్య సినిమాయే అని క్లారిటీ వ‌చ్చేసింది. అయితే అదే బాబీడియోల్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న పీరియాడిక‌ల్ మూవీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

ఇప్పుడు బాల‌య్య సినిమాలోనూ నెగ‌టివ్ రోల్లోనే చేస్తున్నాడ‌ట‌. ఇక బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలోనూ బాలీవుడ్‌కే చెందిన సీనియ‌ర్ హీరో అర్జున్ రామ్‌పాల్ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news