Newsచిరంజీవి చుట్టం అయితే ఏంటి... నువ్వు టాలీవుడ్ నుంచి పో అంటూ...

చిరంజీవి చుట్టం అయితే ఏంటి… నువ్వు టాలీవుడ్ నుంచి పో అంటూ వార్నింగ్‌…!

సినిమా ఇండస్ట్రీలో బంధుత్వంతో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. అసలు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళూ ఉన్నారు. మరికొందరు అటు ఇటూ ఊగిసలాడూ ఉన్నవాళ్ళూ లేకపోలేదు. ఇక్కడ సక్సెసే ప్రధానం. అది లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా, ఆయన కొడుకైనా, నిర్మాతైనా, దర్శకుడైనా, ఆఖరికి అందాలు ఆరబోసే హీరోయిన్ అయినా విలువుండదు. సక్సెసే ఇక్కడ ఎవరినైనా ఎక్కడికో తీసుకెళుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో నటవారసులున్నారు. కానీ, అందరూ సక్సెస్ కాలేదు. దీనికి ఉదాహరణ దాసరి నారాయణ, ఎమ్మెస్ నారాయణ కొడుకులే. అయితే, ఇప్పుడు మెహర్ రమేశ్ గురించే అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా కన్నడ ఇండస్ట్రీకి పోయి సినిమాలు చేసుకో అంటూ సలహాలిస్తున్నారట. దీనికి కారణం ఆయన మెగాస్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకొని కూడా భారీ డిజాస్టర్ ఇచ్చాడు.

కంత్రి సినిమాతో దర్శకుడైన మెహర్ రమేశ్..తెలుగులో ఇచ్చిన హిట్స్ ఏమీ లేవు. వెంకటేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసి డిజాస్టర్స్ ఇచ్చాడు. ఇక్కడ అట్టర్ ఫ్లాపైన ఆంధ్రావాలా సినిమాను కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో తీసి సూపర్ హిట్ ఇచ్చాడు. మెహర్ రమేశ్ సినిమాలు..ఆయన మేకింగ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు పనికిరావు. కన్నడలో మాత్రం అడపాదడపా హిట్స్ అందుకున్నాడు.

ఆయన తెలుగు హీరోలకి హిట్స్ ఇవ్వలేడని ముద్రపడింది. చాలాకాలం కనుమరుగయ్యాడు. అయినా మెగాస్టార్ కి బంధువు కావడంతో ఆయన ఓ ఛాన్స్ ఇచ్చాడు. భోళా శంకర్ సినిమా చేస్తున్నప్పుడే చిరు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో అసలు అంచనాలు లేవు. అదే నిజమైంది. తమిళంలో హిట్ అయిన సినిమాను కూడా ఇక్కడ సరిగ్గా తీయలేకపోయాడు. దాంతో మెగా అభిమానులే మెహర్ మీద మండిపడ్డారు. నువ్వు మళ్ళీ సినిమా తీయకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news