Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' గ‌ణేశ్ ఆంథ‌మ్ ఫుల్ వీడియో (...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ గ‌ణేశ్ ఆంథ‌మ్ ఫుల్ వీడియో ( వీడియో)

నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా దసరా కానుకగా గత నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా బాల‌య్య కెరీర్‌లో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి తర్వాత మూడో విజయం సాధించింది.

30 సంవత్సరాల తర్వాత బాలయ్యకు ఈ మూడు సినిమాలతో మూడు వ‌రుస విజయాలు దక్కాయి. బాలయ్య కెరీర్‌లో ఇది అరుదైన రికార్డ్‌. బనావో బేటికో షేర్ అనే గొప్ప సందేశం తో తీర్చిదిద్దిన ఈ సినిమా నుంచి యాక్షన్స్ స‌న్నివేశాలు అదిరిపోయాయి. థ‌మన్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

గణేష్ యాంత‌మ్ ఫుల్ వీడియో విడుదలైంది. బాలకృష్ణ, శ్రీలీల‌ మాస్ డ్యాన్స్‌తో ఊపేసార‌నే చెప్పాలి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది. దీనిపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఇక బాలయ్య తర్వాత సినిమా విషయానికొస్తే బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news