Newsదేవ‌ర‌, వార్ 2 కంటే ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ సినిమా... ఫ్యీజులు...

దేవ‌ర‌, వార్ 2 కంటే ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ సినిమా… ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టేశారు. ఈ సినిమాతో తిరుగులేని సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ కొరటాల శివ దర్శకత్వంలో దేవర1, 2వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలోను నటిస్తున్నాడు. య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవర షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు డేట్‌లు కేటాయిస్తాడు. ఆ వెంటనే ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే దేవర, వార్ 2 కంటే ముందే ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఆ సినిమా క్రేజీ ప్రాజెక్ట్‌ కావటం విశేషం. సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 సినిమాలో ఎన్టీఆర్ మెరుపులా మెరవబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో షారుక్‌, హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నారు. షారుక్ ఈ సినిమాలో పఠాన్‌గా దర్శనమిస్తాడు. అతడి పాత్ర సుమారు పావు గంట పాటు ఉంటుంది. అయితే హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయని కూడా టాక్ నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news