Newsప్రభాస్ తన పుట్టినరోజుకి చేసే అదే పని అనుష్క కూడా తన...

ప్రభాస్ తన పుట్టినరోజుకి చేసే అదే పని అనుష్క కూడా తన బర్త డే కి చేస్తుంది తెలుసా.. ఇదే ప్రేమంటే..!

నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు ఆమె శ్రేయోభిలాషులు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అనుష్కకు విషెస్ అందజేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తన పుట్టినరోజుకి ఏ పని అయితే చేస్తాడో అదే పని చేసే అలవాటు అనుష్కకి ఉంది అన్న విషయం బయటపడింది . మనకు తెలిసిందే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు .

త్వరలోనే అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి . ప్రభాస్ తన పుట్టినరోజు నాడు ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ కి డబ్బులు తగలేసి పార్టీలు ఇవ్వడు .. ఆ డబ్బులతో పేదవారికి అనాధ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తాడట. సేమ్ టు సేమ్ అనుష్క కూడా అంతే తన ఫ్రెండ్స్ కి లేదా ఇతర సభ్యులకి ఎవరికి పార్టీలు అంటూ డబ్బులు తగలేయదట.

ఆమె ఏది ఉన్నా సరే తన బర్త డే కొ తన స్తోమతకు తగ్గట్టు అనాధ పిల్లలకి వృద్ధాశ్రమంలోని పెద్ద వాళ్లకు ఫుడ్ పంపిణీ చేస్తుంది. ఇది నిజంగా చాలా చాలా గ్రేట్.. అయితే ఇది అనుష్కకు ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ కాకముందు నుంచే ఉన్న అలవాటు అంటూ కూడా తెలుస్తుంది. అలా దేవుడు వీరిద్దరికి రాసి పెట్టాడు కాబట్టే వీళ్ళిద్దరికీ క్వాలిటీస్ ఒకేలా ఉన్నాయి అంటూ రెబెల్ అనుష్క ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే ఇదే అంటూ కూడా పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news