Newsశ్రీదేవి - బోనీక‌పూర్ సీక్రెట్ మ్యారేజ్ ఎక్క‌డ ? ఎలా...

శ్రీదేవి – బోనీక‌పూర్ సీక్రెట్ మ్యారేజ్ ఎక్క‌డ ? ఎలా జ‌రిగింది… !

దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ప్రేమ వివాహం పై నేటికీ ఎన్నో అనుమానాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే జాన్వీ కపూర్ కూడా వీరు పెళ్లికి ముందే పుట్టారని ఎప్పటినుంచో వార్తలు ఉన్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోనీ కపూర్ ఆ వార్తల‌పై స్పందించారు. తాను శ్రీదేవి 1996లో షిరిడీలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని.. ఆ తర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి విషయాన్ని మీడియాకు వెల్లడించామ‌న్నారు.

1997 జనవరిలో మరోసారి పబ్లిక్ గా పెళ్లి చేసుకున్నాం.. ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు చెప్పాం.. దాంతో అనేక రూమర్ల మొదలైనట్టు బోనీ తెలిపారు. జాన్వి 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వి మా పెళ్ళికి ముందే పుట్టిందని కొన్ని మీడియాలో అప్పుడే రాంగ్ వార్తలు వచ్చాయి. ఆ వార్తలే ఎప్పటికీ కొనసాగుతున్నాయని బోనీ తెలిపారు. తన పుట్టినరోజు గురించి ఎన్నిసార్లు వివరించినా ఈ ప్రచారం మాత్రం ఆగటం లేదని.. అలాగే శ్రీదేవికి దేవుడిపై ఎప్పుడూ ఎంతో నమ్మకం ఉందని బోనికపూర్ తెలిపారు.

శ్రీదేవి తన ప్రతి పుట్టినరోజుకు తిరుమలకు వెళ్లేవారని.. అలానే ఇప్పుడు జాన్వి కపూర్ కూడా ప్రతి మూడు నెలలకు కచ్చితంగా తిరుమల వెళుతూ ఉంటుందన్నారు ఇక తన ఇద్దరు కుమార్తెల సినీకేరీర్‌ విషయంలో బోనికపూర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అలాగే నిర్మాతగా కూడా ఆయన ప‌లు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక జాన్వీకపూర్ తెలుగులో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news