Newsప్ర‌భాస్ - మారుతి సినిమా స్టోరీ లైన్ ఇదే... అప్పుడే గుడ్...

ప్ర‌భాస్ – మారుతి సినిమా స్టోరీ లైన్ ఇదే… అప్పుడే గుడ్ న్యూస్‌..!

ప్రభాస్ అభిమానులకు వరుసగా ఏదో ఒక అప్డేట్ తో పండగ లాంటి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటివరకు అప్డేట్ తో వరుసగా పండగ చేసుకుంటోన్న‌ అభిమానులు మధ్య మధ్యలో కల్కి ప్రమోషనల్ వీడియోలు.. పోస్టర్లు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కోసం మరో అదిరిపోయే అప్డేట్ రెడీ అయింది. డైరెక్టర్ మారుతి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాబోతుంది. ఈ విషయాన్ని మారుతి స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులే లేవు.

ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విషయాలను ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచి.. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా జోనర్ ఏంటి ? టైటిల్ ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలియటం లేదు. మేకర్స్ మాత్రం గప్‌చుప్‌గా తమ పని తాను చేసుకోబోతున్నారట.ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయిందట. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్డేట్ రెడీ అయింది.

ప్రభాస్ పుట్టిన రోజు కానుక‌గా ఈనెల 23న మారుతి సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు.
కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేస్తారని.. టైటిల్ ప్రకటించారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ తో తాను చేయబోతున్న సినిమా లైన్ ఎలా ఉంటుందో ? మారుతి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పేసాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తారు.

నూటికి నూరు శాతం ఫన్ ఉంటుంది..అదే టైంలో ప్రభాస్ ఎనర్జిటిక్గా మరింత యంగ్ గా క‌నిపిస్తార‌ట‌. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ను ఆడియన్స్ ఎలా ఇష్టపడ్డారో ? అలా ఉండబోతుందని తెలియజేశారు. ఈ సినిమాలో మాళవిక మోహన్ మెయిన్ హీరోయిన్… నిధి అగర్వాల్ – రిద్ది కుమార్ కూడా నటించబోతున్నారు. 2024 చివరి కల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news