News' దేవ‌ర ' ఇంట‌ర్వెల్ బ్యాంగ్ చెప్పిసిన ర‌త్న‌వేలు... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా...

‘ దేవ‌ర ‘ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ చెప్పిసిన ర‌త్న‌వేలు… థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా తార‌క్ విశ్వ‌రూపం..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చాలా అంటే చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప‌నిచేస్తోన్న‌ అన్ని కాంబినేషన్లో క్రేజీ కాంబినేషన్లుగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ – కొరటాల జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కలిసి చేస్తున్నారు. దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు తెలుగు సినీ జనాలు.

అలాంటి జాన్వీ దేవరతో టాలీవుడ్కు తొలిసారిగా హీరోయిన్గా పరిచయం అవుతుంది. అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్.. ఇటు ఎన్టీఆర్ సోదరడు కళ్యాణ్‌రామ్ నిర్మాత.. అటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ ఇలా చూసిన ఈ కాంబినేషన్ మామూలుగా లేదు. అటు ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్‌ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా. ఇక రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఇలా ఒక్కొక్కరు చాలా అంటే చాలా క్రేజీ పర్సన్స్ కావడంతో దేవర సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ? ఊహకే అర్థం కావడం లేదు.

ఇది ఇలా ఉంటే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు సంబంధించి తన సోషల్ మీడియా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశాడు. భారీ మిడ్ నైట్ సి యాక్షన్ షూట్ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ సీన్‌ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందని.. షూటింగ్ లొకేషన్లో ఉన్న ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి లభిస్తుందని కూడా రత్నవేలు చెప్పాడు.

సముద్రంలో అర్ధరాత్రి కళ్ళు చెదిరే యాక్షన్స్ విజువల్స్ థియేటర్లలో మనం ఎంజాయ్ చేస్తామని కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఈ సీన్ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్‌ను మించి ఉంటుందని.. తారక్ నట విశ్వరూపం మామూలుగా ఉండదని కూడా సినిమా యూనిట్ నుంచి సమాచారం వస్తుంది. ఏది ఏమైనా దేవరతో కొరటాల పాన్ ఇండియా డైరెక్టర్ గా తానెంటో ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టప‌డి పనిచేస్తున్న మాట వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news