Newsఅఖిల్ సినిమాలో సమంత.. వీళ్లు నిజంగానే కలిసిపోయారా..? బ్యాక్ టూ అక్కినేని...

అఖిల్ సినిమాలో సమంత.. వీళ్లు నిజంగానే కలిసిపోయారా..? బ్యాక్ టూ అక్కినేని ఫ్యామిలీ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగార్జున మళ్ళీ కలవబోతున్నారు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాము. సమంత ఎంతో ప్రేమగా పెంచుకునే పెట్ హ్యాష్ నాగచైతన్య వద్ద దర్శనం ఇచ్చినప్పటి నుంచి ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. త్వరలోనే అఖిల్ సినిమాలో హీరోయిన్ సమంత ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చిన అఖిల్ ఇప్పటివరకు హిట్ అందుకు నిందే లేదు . అయితే సమంత నాగచైతన్య పెళ్లి తర్వాత అఖిల్ సమంతకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు . ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న సరే కుటుంబం ను ఎదిరించి సమంతతో మాట్లాడుతూనే ఉన్నాడు . ఆమె మయోసైటీస్ వ్యాధికి గురైనప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక్కరంటే ఒక్కరు సపోర్ట్ చేయలేదు.

కానీ అఖిల్ మాత్రం గెట్ వెల్ సూన్ అంటూ ఆమెను ఎంతో సపోర్ట్ చేశారు . ఈ క్రమంలోనే రీసెంట్గా అఖిల్ కమిట్ అయిన సినిమాలో కీలక పాత్ర కోసం డైరెక్టర్ సమంత ను చూస్ చేసుకోగా అఖిల్ ఓకే చేశారట. సమంత హెల్త్ బాగో లేకపోయినా కూడా మాజీ మరిది కోసం కెరియర్ సెటిల్ అవ్వడానికి సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే వీళ్ళు నిజంగానే కలిసిపోయారా..? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి . అయితే అదే సమయంలో చైతన్య పై ఉండే ప్రేమతో వేసుకునే టాటూను తీసేసింది అని తెలియడంతో ఇదంతా కేవలం ఫేక్ అని జనాలు చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news