Newsప్ర‌భాస్ ' కల్కి 2898 AD ' సినిమాలో రానా ఉన్నాడా......

ప్ర‌భాస్ ‘ కల్కి 2898 AD ‘ సినిమాలో రానా ఉన్నాడా… ప‌క్కాగా క్లారిటీ…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే – దిశాపటాని హీరోయిన్లుగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ కీలకపాత్రలో.. యూనివర్సిటీ హీరో కమలహాసన్ విలన్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 AD. మహానటి సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ ఈ మాసివ్ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ రు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక లార్జ‌ర్‌దెన్‌ లైఫ్ సినిమాగా ఉండేలా మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్లో ప్లాన్ చేసి తమ సినిమా ప్రమోషన్లు ప్రారంభించారు. ఈ ప్రమోషన్లలో రానా దగ్గుబాటి కూడా కనిపించడం చాలా మందికి ఆసక్తిగా అనిపించింది. దీంతో అసలు రానాకి ఈ కల్కి సినిమాకి ఉన్న కనెక్షన్ ఏంటని ? చాలామంది సందేహం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రానా ఉన్నాడా అన్న డౌట్లు కూడా కొందరికి వచ్చాయి. ఈ సినిమాలో రానా లేడు అయినా కూడా ప్రభాస్ తో పాటు హాలీవుడ్ వీధుల్లో కనిపించడం ఫ్యాన్సులో మంచి హై ఇచ్చింది. అసలు ఈ సినిమాకి రానాకి కనెక్షన్ ఏంట‌న్న ప్ర‌శ్న ఈరోజు రానాకి ఎదురయింది. దీనికి రానా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేశాడు. తెలుగు సినిమా ఎక్కడ బౌండరీలు దాటిన నా అవసరం ఉంటే నేను కచ్చితంగా ఉంటానని తెలిపాడు.

దీంతో రానా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ దెబ్బతో తెలుగు సినిమా పట్ల రానాకు ఎంత గౌరవం ఉందో అన్న ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రానా బాహుబలి లాంటి సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. పాత్రలో ప్రయారిటీ ఉంటే హీరో పాత్ర అయినా.. విలన్ పాత్ర అయినా రానా నటిస్తాడు అన్నది తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news