Moviesసీనియ‌ర్ ఎన్టీఆర్‌తో శ్రీలీల‌కు ఆ విష‌యంలో పోలికా... న‌థింగ్ అన్న క్రేజీ...

సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో శ్రీలీల‌కు ఆ విష‌యంలో పోలికా… న‌థింగ్ అన్న క్రేజీ బ్యూటీ..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట విన్న క్రేజీ బ్యూటీ శ్రీలీల పేరు వినిపిస్తోంది. శ్రీలీల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే రామ్ స్కంద‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల దసరా కానుకగా అక్టోబర్ నెలలో భగవంత్‌ కేసరి – నవంబర్లో ఆది కేశవ – సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం – మధ్యలో డిసెంబర్లో నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలో సగటున నెలకు ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి.

ఇందులో భగవంత్‌ కేసరి గుంటూరు కారం సినిమాలపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాలు కాకుండా శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. అటు స్టార్ హీరోల నుంచి.. ఇటు మిడిల్ రేంజ్ హీరోల‌ వరకు అందరూ ఇప్పుడు శ్రీలీల వెంట పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలోనూ శ్రీలీల‌ హీరోయిన్.. అటు రామ్ చరణ్ కూడా శ్రీలీలతో జోడి కట్టేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ – నితిన్ లాంటి హీరోలు శ్రీలీలను పదే పదే తమ సినిమాలో రిపీట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీనిని బట్టి శ్రీలీల సినిమాలో ఉంటే కుర్ర హీరోల సినిమాలకు ఎలాంటి ? క్రేజ్ వస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల ఈ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుసగా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కదా.. మీకు ఎలా అనిపిస్తుందని ? అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ముచ్చటేసేలా ఉంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ తర్వాత.. జనరేషన్ హీరోలు ఏడాదిలో పది నుంచి పదిహేను సినిమాలలో నటించేవారు.. వారు ఏడాదికి అన్ని సినిమాలు చేశారంటే ఎంత గొప్ప విషయమో చెప్పండి.. వారితో పోలిస్తే నేను నథింగ్ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది.

ఏది ఏమైనా అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ అలాంటి హీరోలు ఏడాదికి పది నుంచి 20 కి పైగా సినిమాలలో నటించేవారు. ఆ సినిమాలు రిలీజ్ అయ్యేవి కూడా..: ఇప్పుడు శ్రీలీల‌ కూడా ఏడాదికి పది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మూడు నాలుగు యేళ్ల‌పాటు టాలీవుడ్ లో శ్రీలీలకు తిరుగులేని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news