News' గుంటూరు కారం ' ఓవ‌ర్ బ‌డ్జెట్... తేడా కొడితే అంద‌రూ...

‘ గుంటూరు కారం ‘ ఓవ‌ర్ బ‌డ్జెట్… తేడా కొడితే అంద‌రూ పాతాళంలోకే…!

మహేష్ బాబుకు వరుస విజయాలు తర్వాత గత ఏడాది చేసిన సర్కారు వారి పాట సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.. జస్ట్ ఓకే సినిమా. మహేష్ బాబు రేంజ్ కి తగ్గ సినిమా అయితే కాదు. ఆ సినిమా వచ్చి ఏడాదిన్నర దాటుతోంది.. ఇంకా మహేష్ సినిమా రిలీజ్ కాలేదు. గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ షూటింగ్ పడుతూ లేస్తోంది. మహేష్ బాబు – త్రివిక్రం కాంబినేషన్ అనగానే ఈపాటికి అదిరిపోవాలి.. సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ? అన్న ఉత్కంఠ మొదలవ్వాలి కానీ గుంటూరు కారం విషయంలో అలాంటివేవీ జరగడం లేదు.

సినిమాకు ఎప్పుడు ఏదో ఒక అవాంతరం వస్తోంది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సోదరుడు రమేష్ మృతి చెందడంతో కొంతకాలం షూటింగ్ వాయిదా పడింది. తర్వాత హీరోయిన్ విషయంలో మార్పులు చేర్పులు జరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మహేష్ ఇంట్రెస్ట్ గా లేడ‌న్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు వచ్చిన టీజర్లు, వీడియోలలో కూడా మ్యూజిక్ ఏ మాత్రం ఆసక్తిగా లేదు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావలసి ఉన్నా అవుట్ పుట్ మహేష్ కు ఏ మాత్రం నచ్చకపోవడంతో వాయిదా వేస్తున్న పరిస్థితి.

సినిమా రిలీజ్ కు గట్టిగా మూడు నెలలు మాత్రమే ఉంది. షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఏమిటో ?ఎలాంటి అప్డేట్లు ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే సినిమా బడ్జెట్ అంచనాలు దాటేసి రు. 200 కోట్లకు పైనే చేరినట్లు తెలుస్తోంది. ఒక మహేష్ బాబు రెమ్యునరేషన్ రు. 80 కోట్లు అంటున్నారు. ఇక త్రివిక్రమ్ కు ఎలా లేదన్న 50 కోట్ల రెమ్యూనరేషన్ ఉంటుంది.. వీరిద్దరి రెమ్యునరేషన్లకి రు. 130 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. మిగిలిన కాస్టింగ్ టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు సినిమా మేకింగ్‌కు అయ్యే ఖర్చుతో కలిపితే రు. 200 కోట్లు దాటి ఆ పైన ఎంత అవుతుందో ? ప్రస్తుతానికి అయితే లెక్క తెలియడం లేదని తెలుస్తోంది.

కేవలం తెలుగు మార్కెట్ ను బేస్ చేసుకుని ఇంత బడ్జెట్ పెట్టడం అంటే చాలా ఎక్కువ ? అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్‌ థియేటర్ ఆదాయం ఎంత వచ్చినా ? థియేటర్ భారం 100 నుంచి 120 కోట్లు పడేలా ఉంది. ఎంతో పెద్ద సూపర్ హిట్ అయితే తప్ప.. అంత షేర్ అయితే వచ్చేలా లేదు. పైగా సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన మహేష్ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్ జరగటం ఖాయం.

పైగా రాజమౌళి లాంటి క్రేజీ డైరెక్టర్ సినిమాకు ముందు మహేష్ కు బ్రేక్ ఈవెన్ లేదా నష్టాలు వచ్చినా సినిమా పడితే అది చాలా పెద్ద దెబ్బ. ఏది ఏమైనా ఈ సినిమా తేడా కొడితే శ్రీలీలా – మహేష్ -త్రివిక్రమ్ – థ‌మ‌న్ ఇలా చాలామంది గ్రాఫ్ పాతాళంలోకి పడిపోవటం ఖాయం. బడ్జెట్ విషయంలో కాస్త అదుపు ఉంచుకుని ఈ సినిమా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news