Newsపాయల్‌ను వాడుకుని ఛాన్సులివ్వ‌కుండా మోసం చేసిందెవ‌రు...?

పాయల్‌ను వాడుకుని ఛాన్సులివ్వ‌కుండా మోసం చేసిందెవ‌రు…?

చూడగానే నాటుగా అనిపించే నార్త్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాలో అమ్మడి ముద్దులు రొమాన్స్ చూసి చిన్న నిర్మాతలు కూడా బూతు కథలను వెంటబెట్టుకొని పాయల్ చుట్టూ తిరిగారు. నార్త్ అమ్మాయి కాబట్టి కాస్త రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే స్క్రీన్ మీద చేసిందేదో బెడ్రూం లో నాతోనూ చేస్తుందనే దిక్కుమాలిన ఆలోచన. కానీ, పాయల్ ఇలాంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళని నిర్మొహమాటంగా చీకొట్టి పంపింది.

పాయల్ రాజ్‌పుత్ నటించిన మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 తర్వాత 60 నుంచి 70 కథలు పట్టుకొని నిర్మాతలు తన వద్దకి వస్తే వాటిలో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ బెడ్రూం సీన్స్, ముద్దులు, ఒళ్ళు చూపించాలని అడిగిన నిర్మాతలు..అలాంటి కథలే ఉన్నాయట. మరీ ఎక్స్ట్రాగా మాడిన కొందరు నిర్మాతలకి బాగానే బుద్ధిచెప్పినట్టుగా సమాధానం చెప్పిందట. ఓ సందర్భంలో ఇదే విషయాన్ని ఓపెన్ గా కూడా పాయల్ చెప్పింది.

అయితే, పాయల్ మరీ అంత కఠినంగా సమాధానం చెప్పకుండా నచ్చిన కథలను కాస్త మార్చి..కొన్ని కండీషన్స్ పెట్టి ఒప్పుకొని ఉంటే తన కెరీర్ కి బాగా ఉపయోగపడేవి. కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పాయల్ ని డీవియేట్ చేసి తప్పుడు సూచనలు ఇచ్చి తన కెరీర్ ని దెబ్బతీశారు. ఒకసారి కెమెరా ముందుకు వచ్చి ఓ సినిమా చేసి సక్సెస్ చూశాక దాని మాయ మత్తు వదలడం ఈజీకాదు.

అదే పాయల్ విషయంలోనూ జరిగింది. పక్కన ఉన్నవాళ్ళు ఇచ్చిన చచ్చు సలహాలు తీసుకొని ఐటెం సాంగ్స్ పనికిమాలిన సినిమాలు చేసింది. దానివల్ల ఇంకొదరు నిర్మాతలు వాడుకోవడానికి ఛాన్స్ తీసుకున్నారే గానీ, పాయల్ కి నిజాయితీగా తన కెరీర్ కి ఉపయోగపడే కథ చెప్పి సినిమా చేయలేదు. చేసిన కొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయంటే ఉన్నాయి తప్ప అద్భుతంగా మాత్రం తన కెరీర్ ఊపందుకోవడానికి సహకరించలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట మాత్రం పాయల్ ని దొరికిన వాడు దొరికినట్టుగా వాడుకున్నారని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news