Movies"మై డార్లింగ్ రష్మిక".. ప్రేమను మొత్తం బయటపెట్టేసిన విజయ్ దేవరకొండ..!!

“మై డార్లింగ్ రష్మిక”.. ప్రేమను మొత్తం బయటపెట్టేసిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – హీరోయిన్ రష్మిక మందన్న ల మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ ఎప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే దీనిపై వీళ్లు ఎప్పటికప్పుడు మేం ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలను కొట్టి పడేస్తూనే వస్తున్నారు . రీసెంట్గా రష్మిక మందన్నా నటించిన అనిమల్ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా ..రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఈ క్రమంలోనే రన్బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే సినిమాకి బూస్టప్ ఇవ్వడానికి విజయ్ దేవరకొండ ..

“మై డియర్ డార్లింగ్స్.. రష్మిక మందన్నా.. సందీప్ రెడ్డి వంగ అంటూ ట్యాగ్ చేస్తూ ఓ రేంజ్ లో పొగిడేసారు “. అంతేకాదు మై ఫేవరెట్ హీరో రణబీర్ కపూర్ అంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాకు ఆల్ ది బెస్ట్ విషెస్ అందించారు . వెంటనే రష్మిక సైతం విజయ్ దేవరకొండ కి రిప్లై ఇచ్చింది . “యూ ఆర్ ది బెస్టేస్ట్” అంటూ రిప్లై ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పేర్లు మరోసారి వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news