Moviesకూతురు మరణం..ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోని..కోలీవుడ్ షాక్..!!

కూతురు మరణం..ఎవ్వరు ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోని..కోలీవుడ్ షాక్..!!

మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటోనీ కూతురు మీరా తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . కాగా గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురవుతున్న ఆమె ఆరోగ్యపరంగా పలు మందులు తీసుకుంటుంది అంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆమె తీవ్రమైన డిప్రెషన్ కి లోనైన కారణంగా ఏం చేస్తుందో తెలియని పొజిషన్లో సూసైడ్ చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఇలాంటి క్రమంలోనే కూతురు చనిపోయిన తర్వాత విజయ్ అంటోని సోషల్ మీడియా వేదికగా ఆమె మరణానికి సంబంధించి సంచలన కామెంట్స్ చేశారు . దీంతో ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా విజయ్ అంటోని ఓ నోట్ ని షేర్ చేశారు . “డియర్ హార్ట్స్.. నా కూతురు మీరా దయామయురాలు ..ధైర్యవంతురాలు . ఆమె ఇప్పుడు కులం – మతం- డబ్బు -బాధ -పేదరికం – ద్వేషం లేని ఓ పీస్ ఫుల్ లోకంలోకి వెళ్లిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది . కానీ ఆమె నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెతో పాటు నేను కూడా చనిపోయాను . నేను ఇప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను . ఆమె ప్రారంభించిన మంచి పనులు అన్నిటిని తన పేరు మీద నేనే పూర్తి చేస్తాను ” అంటూ చాలా ఎమోషనల్ గా నోట్ రాసుకోచ్చాడు విజయ్ అంటోని .

దీనిపై ఆయన అభిమానులు సైతం స్పందిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు . అయితే ఎందుకు మీరా సూసైడ్ చేసుకున్నింది..? అన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు . పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా..? లేదా..? ఆమెకు ఆమెను సూసైడ్ చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా..? అన్న విషయం పై పోలీసులు విచారణ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news