Newsసుమ‌న్ మిస్ అయ్యి బాలయ్య బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన సినిమా ఇదే..!

సుమ‌న్ మిస్ అయ్యి బాలయ్య బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన సినిమా ఇదే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు ఒక్కసారి సూపర్ హిట్ సినిమాలు మిస్ అవుతూ ఉంటారు. ఒక హీరో మిస్సయిన కథతో మరో సినిమా మరో హీరో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక హీరో మిస్ అయిన సినిమా మరో హీరో చేసి డిజాస్టర్లు కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. తెలుగు సినిమాలలో ఒకప్పుడు అందానికి, అద్భుతమైన నటనకు కేరాఫ్ సుమన్.

సుమన్ అప్పట్లో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చారు. అయితే ఆయన అనవసరంగా ఒక కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లి రావడంతో అప్పటినుంచి ఆయన కెరీర్ డౌన్ అయింది. రీఎంట్రీ ఇచ్చాక సుమ‌న్‌ కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. సుమన్ అంటే ఫైట్స్, యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ కు కేరాఫ్ అడ్రస్. ఇది ఇలా ఉంటే సుమన్ మిస్సయిన ఒక సినిమాను నట‌సింహం బాలకృష్ణ చేసి సూపర్ హిట్ కొట్టారు.

ఆ సినిమా ఏదో కాదు రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా ముందుగా సుమన్ దగ్గరికే వెళ్లిందట. ఆ టైంలో సుమన్ కాస్త బిజీగా ఉండడంతో వెంటనే బాలయ్య దగ్గరికి వెళ్ళింది. బాలయ్య ఈ సినిమా చేసి తన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పాలి. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై టి. త్రివిక్ర‌మ‌రావు నిర్మించిన ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించారు.

విచిత్రం ఏంటంటే బాలకృష్ణ చేయాల్సిన ఒక సినిమా ఆయన వదులుకోవడంతో సుమన్ చేసి కూడా సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా ఏదో కాదు బావ బావమరిది. ఈ సినిమాలో కృష్ణంరాజు – సుమన్ బావ బావమరుదులుగా నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news