Newsరానా కోట్ల ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాల‌నుకున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే...!

రానా కోట్ల ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాల‌నుకున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో దగ్గుపాటి వంశం నుంచి మూడో తరంలో సినిమాల్లోకి వచ్చాడు దగ్గుబాటి రానా. తాత రామానాయుడు లెజెండ్రీ నిర్మాత. తండ్రి సురేష్ బాబు కూడా టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా, టాప్ డిస్ట్రిబ్యూటర్ గా రాణిస్తుంటే.. బాబాయ్ విక్టరీ వెంకటేష్ సీనియర్ హీరోగా కొనసాగుతున్నారు. వీరి బాటలోనే సినిమాల్లోకి వచ్చిన రానా టాలీవుడ్ లో మంచి హీరోగా నిలదొక్కుకున్నారు.

రానా అటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలలో నటించారు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. రానా కొందరు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన మాట వాస్తవం. ఈ లిస్టులో త్రిషతో పాటు కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది తదితరులు ఉన్నారు. అయితే రానా దమ్మారో ద‌మ్‌ సినిమాలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషాబ‌సుతో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్నప్పుడు రానా బిపాసాతో డేటింగ్ చేశాడన్న పుకార్లు కూడా ఉన్నాయి.

ఆమెను హైదరాబాద్ మొత్తం తిప్పుతూ తన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూపించడంతో ఆ ఆస్తులకు ఫ్లాట్ అయిపోయిన బిపాసా రానాను తన మొగుడిని చేసుకోవాలని ఎంతో ట్రై చేసిందట. అయితే రానా బిపాసాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని అంటారు. ఎలాగైనా రాణాకు భార్య అయిపోవాలని.. దగ్గుబాటి ఇంటికి ఆ కోట్లాది ఆస్తులకు కోడలు అయిపోవాలని చాలా కలలుకందట.

రానాను త‌న వ‌ల‌లో వేసుకునేందుకు ఎన్నో ప‌న్నాగాలు పన్నింద‌ట‌. అయితే రానా మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక రానా రెండేళ్ల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు బిపాషా త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన క‌ర‌ణ్‌సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లాడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news