MoviesTL రివ్యూ: జ‌వాన్‌

TL రివ్యూ: జ‌వాన్‌

జ‌వాన్ ప‌రిచ‌యం:
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ గత పది ఏళ్లలో సరైన హిట్ లేక విలవిల్లాడిపోయాడు. చివరకు షారుక్ ఖాన్ కు ఉన్న సూపర్ స్టార్ హోదా కూడా తీసివేయాలన్నా డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. అలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ యేడాది నటించిన పఠాన్ సినిమాతో షారుక్‌ ఒక్కసారిగా కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక షారుక్ అభిమానుల‌లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇక పఠాన్ ఇచ్చిన ఉత్సాహంతో తాజాగా షారుక్ జవాన్ సినిమాతో మరోసారి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నయనతార – తమిళ్ డైరెక్టర్ అట్లి – దీపికా పదుకొనే ఈ సినిమాలో ఇతర పాత్రలలో నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
ఈ సినిమా ప్రారంభమైన వెంటనే పూర్తి గాయాలతో షారుఖ్ ఖాన్ ( విక్రమ్ రాథోడ్) నీటి ప్రవాహంలో కొట్టుకు వస్తాడు. అక్కడ అటవీ ప్రాంతంలో ఉన్న కొందరు ఆయన గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దండగలు దాడులు చేసేందుకు వస్తారు. షారుక్‌ వారిని కాపాడతాడు. అదే సమయంలో ముంబై మహానగరంలో ఒక మెట్రోను షారుఖ్ ఖాన్ ( విక్రం రాథోడ్ ) అండ్ టీం హైజాక్ చేస్తారు. ఆ టీంలో ప్రియమణి, మాన్యా మల్‌హోత్రతో పాటు మరికొందరు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పని చేసే జవాన్ షారుక్ ఖాన్ ఆ మెట్రోను ఎందుకు ? హైజాక్ చేశాడు ఆ హైజాక్ సీన్లో పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు ( నర్మద ) ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి.. విక్రం కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేస్తున్నారు ? అన్న సీన్లు చాలా ఆసక్తిగా కొనసాగుతూ ఉంటాయి.

ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి కొడుకులు పాత్రలలో షారుక్‌ కనిపిస్తారు. ముంబై నగర శివారు ప్రాంతంలో ఒక జైలులో ఆజాద్గా పనిచేసే ( షారుక్ ) అక్కడ జైలర్ గా ఉంటాడు. ఇక విక్రం రాథోడ్ కోసం పనిచేసే అమ్మాయిలు ప్రియ‌మ‌ణి, మానియా మల్హోత్రా ఇద్దరు అదే జైలులో ఖైదీలుగా ఉంటారు. ఈ సినిమా మొత్తం ఊహించ‌ని విధంగా ఫుల్ ట్విస్టుల‌తో మలుపులు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు వెపన్ డీలర్ గా ఉన్న విజయ్ సేతుపతి ఆర్మీలో పనిచేస్తున్న విక్రమ్ రాధోడ్‌కు మధ్య శత్రుత్వం ఎక్కడ మొదలవుతుంది.

ఒక జవాన్ పై దేశద్రోహి అనే ముద్రపడటం వెనక ఏం ? జరిగింది.. విక్రమ్ రాథోడ్ భార్య పాత్రలో నటించిన దీపికా పదుకొనే కు ఎందుకు ? ఉరిశిక్షపడుతుంది. దేశద్రోహిగా ముద్రపడిన విక్రమ్ రాథోడ్ కోసం అతడితో పాటు ఆర్మీలో పని చేసిన స్నేహితులు ఏం చేశారు ? విక్రమ్ రాథోడ్ తండ్రి కొడుకులు అయినా ఎందుకు విడిపోయారు ? పోలీస్ ఆఫీసర్గా ఉన్న నయనతార ఆజాద్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది ? పెళ్లి తర్వాత విక్రం ప్రాజెక్టు కోసం ఆమె ఎందుకు పనిచేసింది ఇలా ఎన్నో త్రిల్లింగ్ అంశాల‌తో కథ‌ అనేక మరుపులు తిరుగుతూ చివరకు ఎలా ? ముగిసింది అన్నది తెలియాలి అంటే జవాన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
ఇప్పటికే మనదేశంలో ఎన్నో భాషలలో యాక్షన్ రివెంజ్ డ్రామా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు అట్లీ జవాన్ ను ఒక మెసేజ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించాడు. చాలా సినిమాలను చూసినట్టుగానే దేశం కోసం ప్రాణాలు అర్పించి సైనికుడికి నష్టం జరిగితే దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుంది ? అన్నది ఈ కథ మెయిన్ లైన్. ఈ సినిమా ప్రారంభంలో మెట్రో హైజాకింగ్ సీన్‌ చాలా బాగుంటుంది. ఆ సీన్లో షారుక్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాలని డిమాండ్ చేయటం.. దేశంలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటో గుర్తు చేస్తూ తన బ్యాంక్ ఖాతాలోకి కొన్ని వేల కోట్లు డిపాజిట్ చేస్తాడు. ఆ డబ్బును బ్యాంకులలో తీసుకుని ఇబ్బందులు పడుతున్న రైతులకు అందిస్తారు.

ఇలా పలు సామాజిక అంశాల నేపథ్యంలో జవాన్ తొలిభాగం ఉంటుంది. జవాన్ తొలిభాగంలో చాలా సీన్లు కొన్ని సినిమాలలో చూసినట్లు ఉన్నా షారుక్ నటనకు తోడు భారీ యాక్షన్ సీన్లు ఉండడంతో ప్రేక్షకుడు అవన్నీ పట్టించుకోడు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే ఈ కేసులో జైల‌రుగా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్టు చేయాలనుకుంటుంది. ఆ సమయంలో ప్రియమణి ఎంట్రీ ఇచ్చి విక్రమ్ రాథోడ్ కు ఆజాద్ కి ఉన్న సంబంధాన్ని రివిల్ చేయటం బాగుంది. ఇంటర్వెల్ ముందు నుంచి జరిగిన ఈ సీన్లు అన్ని సినిమాకి హైలెట్గా నిలుస్తాయి.

సెకండాఫ్ లో మంచి యాక్షన్ తో సినిమా ప్రారంభమైన తర్వాత కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది. జవాన్ చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఆ జవాన్ ప్రాణాలు ఎలా పోయాయి ? అన్న సీన్ తీసిన విధానం బాగుంది. ఇక షారుక్ ఖాన్ విక్రం రాథోడ్ – ఆజాద్ పాత్రలలో దుమ్ము లేపాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. షారుక్ స్క్రీన్ ప్రజెంటేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్ సీన్లు పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. నయనతార ఆజాద్ కు భార్య..గా మరో బిడ్డకు తల్లిగా.. ఒక పోలీస్ ఆఫీసర్గా అదిరిపోయే నటనతో మెప్పించింది. విక్రమ్ రాథోడ్ కు భార్య‌గా దీపికా పదుకొనే కనిపించింది కొంతసేపు అయినా ఆమె పాత్ర సినిమాకు ప్లస్ అవుతుంది.

సెకండ్ ఆఫ్ లో విలన్ గా విజయ్ సేతుపతి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతికి బాలీవుడ్ మార్కెట్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పాలి. క్లైమాక్స్‌లో సంజయ్ ద‌త్‌ చిన్న కామియోరోల్లో కనిపించి మెప్పిస్తాడు. టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్ ప్లే. కథ పాతది అయినా తాను రాసుకున్న కథ‌ ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టించలేదు. విజువల్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్లు హై రేంజ్ లో ఉంటాయి. అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. యాక్షన్ సీన్లు వరకు బాగున్న హీరో ఎలివేషన్ తో పాటు పలు సీన్ల‌లో అనిరుధ్ నుంచి ఆశించిన మ్యూజిక్ అయితే రాలేదు. కెమెరా పనితనం చాలా రిచ్‌గా ఉంది. ఎడిటర్ చాలా వరకు సినిమా క్రిస్పీగా ఉండేలా ట్రై చేశాడు. నిర్మాణ విలువలు అదిరిపోయాయని చెప్పాలి.

ఫైన‌ల్ పంచ్‌: జ‌వాన్‌కు జై కొట్టాల్సిందే

జ‌వాన్ రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news